Elephant returns child's shoe that fell inside its enclosure ఏనుగుల ఎన్ క్లోజర్ లో చిన్నారి షూ.. తీసిచ్చిన గజరాజు..

Elephant lends a trunk to return shoe dropped by child at china zoo

viral, viral news, viral video, viral post, viral elephant, viral elephant returns shoe, viral elephant videos, viral elephant clips, child, china zoo, elephant shoe, child's shoe, dropped shoe, elephant video

A courteous gesture of an elephant from a zoo in China has taken social media by storm. Recently, a baby visited the zoo with their guardian to get a glimpse of wildlife but accidentally dropped their shoe. The animal picked up the show from the ground and returned it to the people beyond the fence.

ITEMVIDEOS: వైరల్​ వీడియో: ఏనుగుల ఎన్ క్లోజర్ లో చిన్నారి షూ.. తీసిచ్చిన గజరాజు..

Posted: 08/19/2022 08:14 PM IST
Elephant lends a trunk to return shoe dropped by child at china zoo

సాధారణంగా అడవి జంతువుల్లో చాలా వరకు మనుషులను చూస్తే భయపడతాయి, లేదంటే భయపెడతాయి. ఇక ఏనుగులు నిజానికి ప్రశాంతంగా ఉండే జీవులే అయినా వాటి భారీ ఆకారాన్ని చూస్తే కొంత భయమేయడం మాత్రం ఖాయమే. అయితే ఎంత వన్యమృగమైన ఏనుగు మాత్రం కేవలం శాఖహారమైన బోజనాన్నే చేస్తూ.. ఆలయ ఉత్సవ ఊరేగింపుల్లోనూ ప్రత్యేకంగా దేవతా విగ్రహాలను ఏనుల అంభారీ మధ్యే తీసుకువెళ్లడం పరిపాటి. దీంతో ఏనుగు భారీ ఆకారంతో ఉన్నా.. అవి మనుషులతో ఎంతో కలుపుగోలుగా ఉంటాయి. అయితే కోపం వస్తే మాత్రం వాటి రౌద్రం భయానకంగా ఉంటుందన్న విషయం ఇప్పటికే అనేక వీడియోల్లో మనం చూశాం.

కానీ ఇక్కడ ఓ ఏనుగు ఇటీవల చేసిన ఓ పని మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. నెటిజనులు నుంచి ప్రశంసలను అందుకుంటోంది. చిన్నారుతో పాటు అందరికీ హత్తుకునేలా ఉన్న ఈ వీడియోలో ఓ చిన్నారి పడేసుకున్న షూను ఏనుగు తొండంతో తీసి చేతికి అందించిన ఈ వీడియో వైరల్ గా మారింది. చైనాలోని షాంగ్ డోంగ్ ప్రావిన్స్ లోని ఓ జూలో ఇది జరిగింది. చైనాకు చెందిన ఓ ఫ్యామిలీ అంతా కలిసి జూకు వెళ్లారు. అలా జంతువులను చూస్తూ చూస్తూ ఏనుగులు ఉన్న ఎన్ క్లోజర్ వద్దకు వెళ్లారు. నేలకు దిగువన కాస్త లోతుగా తవ్విన గుంతలాంటి ఎన్ క్లోజర్ లో ఏనుగులు ఉన్నాయి. అంతా నిలబడి వాటిని చూస్తుండగా.. ఓ చిన్నారి షూ ఆ ఎన్ క్లోజర్ లో పడిపోయింది.

అది గమనించిన ఏనుగు.. మెల్లగా తన తొండంతో షూను పట్టుకుని తీసి.. పైన నిలబడి చూస్తున్న వారికి అందజేసింది. ఆ షూను తీసుకున్న పిల్లలు.. కొంత గడ్డిని ఆ ఏనుగుకు ఇచ్చారు. ఏనుగు ఆ గడ్డిని తినేస్తూ వెనుదిరిగింది. దీనంతటినీ అక్కడున్న కొందరు వీడియో తీశారు. ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు.  ఏనుగు చిన్నారి షూను తీసిచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేల కొద్దీ వ్యూస్, లైకులు వస్తున్నాయి. ‘ఎవరో ఆ ఏనుగును సరిగా చూసుకుంటున్నారు, అందుకే పద్ధతిగా వ్యవహరిస్తోంది’ అని కొందరు కామెంట్ చేస్తే.. ‘ఈ ప్రపంచానికి ఏనుగులను ఇన్ చార్జులుగా పెడితే బాగుపడుతుంది..’ అని మరికొందరు ప్రశంసిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : viral video  animal  animal video  elephant returns shoe  China  

Other Articles