State-sponsored eggs hurled at me: claims former CM గాడ్సేను పూజించేవాళ్లు నన్ను బతకనిస్తారా.? సిద్దరామయ్య ఫైర్

They killed gandhi you think they will spare me siddaramaiah day after protests

Former CM Siddaramaiah, eggs hurled at former cm car, black flags waved Siddaramaiah, BJP, Mahatma Gandhi, pro-Hindutva protesters, Kodagu, Chikkamagaluru district, flood-hit areas, police department, preventive arrests, RSS, Bajrang Dal, Sringeri Sharada Peeta, Jagadguru Rambhapuri Peeta, Balehonnur, Karnataka, Politics

A day after eggs were hurled at his car and black flags waved at him in Kodagu district, Congress Legislature Party leader Siddaramaiah on Friday said the attacks were ‘sponsored by the state’. On Friday, too, he was greeted by BJP and pro-Hindutva protesters in Chikkamagaluru district while he was on a tour of flood-hit areas.

గాంధీ హంత‌కులు న‌న్ను బ‌త‌క‌నిస్తారా..? : బీజేపీ నిర‌స‌న‌ల‌పై సిద్ధ‌రామ‌య్య ఫైర్‌

Posted: 08/19/2022 05:28 PM IST
They killed gandhi you think they will spare me siddaramaiah day after protests

వ‌రుణుడు దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలపై తన ప్రభావాన్ని చాటిన నేపథ్యంలో వర‌ద ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కోంటున్నారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ప‌రామ‌ర్శించేందుకు కొడ‌గు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన క‌ర్నాట‌క మాజీ సీఎం, విప‌క్ష నేత సిద్ధ‌రామ‌య్యకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహ‌నానికి బీజేపి, హిందుత్వ కార్యకర్తలు న‌ల్ల జెండాలు చూపుతూ నిరసన ప్రదర్శనకు దిగారు. ఆయన కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరి మరీ తమ వ్యతిరేకతను చాటారు. ఈ ఘటన గురువారం జరిగింది. అయినా వీటిని పెద్దగా పట్టించుకోని సిద్దరామయ్య.. ఇవాళ చికమంగళూరు ప్రాంతంలోని వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి అక్కడి బాధితులతో పరామర్శించారు.

కొప్పా, శృంగేరి తాలుకాల్లోని పలు వరద ప్రాంతాలను సందర్శించిన ఆయన అక్కడి బాధితులతో వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన శృంగేరిలోని శారదా పీఠాన్ని సందర్శించారు. ఆ తరువాత బలేహోన్నూర్ లోని జగద్గురు రంభాపురి పీఠాధిపతి ప్రసన్న వీరసోమేశ్వర స్వామి వారి ఆశీర్వాదాలను తీసుకున్నారు. ఈ పర్యటనను ముగించుకుని తిరుగివస్తున్న క్రమంలో ఆయన వాహనాన్ని శృంగేరి తాలుకాలోని మెనేసి గ్రామంతో పాటు కొప్పా తాలుకాలోని మక్కికొప్పాలోనూ ఆపేందుకు బీజేపి యువమోర్చా కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే వెంటనే పోలీసులు వారిని చెదరగొట్టడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇక ఈ పర్యటన నేపథ్యంలోనూ ఆయన కారుకు నల్లజెండాలు ప్రదర్శించారు హిందుత్వ కార్యకర్తలు. ఈ ఘ‌ట‌న నేప‌ధ్యంలో కాంగ్రెస్ నేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గాంధీని చంపిన వీరు త‌న‌ను బ‌త‌క‌నిస్తారా అని ప్ర‌శ్నించారు. గాంధీని కాల్చిచంపిన గాడ్సే ఫోటోను బీజేపీ శ్రేణులు పూజిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. కొడ‌గు ప‌ర్య‌ట‌న‌లో బీజేపీ కార్య‌క‌ర్త‌లు నిర‌స‌నలకు, కోడిగుడ్ల దాడికి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఉందని ఆయన అరోపించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకుండా కాలయాపన చేసిందని, ఆ విషయాలు తన పర్యటనలో ఎక్కడ వెలుగులోకి వస్తాయోనని ఈ తరహా నిరసనలకు బీజేపి దిగిందని ఆయన అరోపణలు చేశారు.

కొడుగు జిల్లా ఎస్పీపై సిద్దరామయ్య తీవ్రంగా ఫైర్ అయ్యారు. తన పర్యటనలో ఇలా నిరసనలు వ్యక్తంచేస్తారన్న విషయం ఆయనకు తెలుసా.? తెలియదా.? అని ప్రశ్నించారు. జిల్లాలోని ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. తన పర్యటన నేపథ్యంలో మందస్తు అరెస్టులు ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఇదే విధంగా ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై పర్యటనలోనూ వ్యవహరిస్తారా.? అని ప్రశ్నించారు. ఇక సిద్ధ‌రామ‌య్య వ్యాఖ్య‌ల‌పై క‌ర్నాట‌క హోంమంత్రి అర‌గ జ్ఞానేంద్ర స్పందిస్తూ ఎవ‌రైనా నిర‌స‌న తెలప‌వ‌చ్చ‌ని, కానీ చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే స‌హించ‌బోమ‌ని హెచ్చ‌రించారు. సిద్ధ‌రామ‌య్య‌కు త‌గినంత భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని పోలీసు అధికారుల‌ను ఆదేశించామ‌ని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles