వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం మామూలే. అడవి జంతువుల దాడిలో చాలా మంది గాయపడుతుంటారు. ఇప్పటివరకు మనకు ఏనుగులు, చిరుతలు, పెద్దపులులు, మొసళ్లు ఇలాంటి వన్యమృగాలు మాత్రమే జనవాసాల్లోకి వచ్చిన విషయం తెలుసు. కానీ దట్టమైన అడవుల్లో, నీళ్లున్న ప్రాంతాల్లో ఉండే ఖడ్గమృగం కూడా జనారణ్యంలోకి వచ్చిందని తెలిస్తే.. అందులోనూ అది ఆందోళన చెంది పట్టణప్రాంతంలోని వీధుల్లో రోడ్డుపై పరుగులు తీస్తుంటే.. ఖచ్చితంగా ఇది భయాందోళన కలిగించే దృశ్యమే. అలాంటి వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రద్దీగా ఉండే పట్టణంలో ఓ ఖడ్గమృగం దర్జాగా నడుస్తున్న వీడియో అది. అయితే, ఈ వీడియోకి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా జోడించారు. ఖడ్గమృగం మనుషుల ఆవాసాలలోకి వచ్చి సంచరించినప్పుడు, దానిపట్ల ఎవరూ భయం, గందరగోళానికి గురికావొద్దని అనే నోట్‌తో వీడియోను షేర్ చేశారు. కానీ, నగరంలో ఖడ్గమృగం ఎవరిపైనా దాడి చేసినట్లు సమాచారం లేదు. రద్దీగా ఉండే నగరంలో ఒక ఖడ్గమృగం పారిపోతున్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను ఇప్పటికే కొన్ని మంది చూశారు. రీ ట్విట్లు కూడా భారీగా వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో జనంతో నిండిన పట్టణంలో ఒక ఖడ్గమృగం నడుస్తున్నట్లు చూపిస్తుంది.
అయితే ఖడ్గమృగం తాపీగా నడుస్తున్న వీడియో కాదిఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో జనంతో నిండిన పట్టణంలో ఖడ్గమృగం ఉరుకులు పరుగులు పెడుతోంది. దాన్ని చూసి చుట్టుపక్కల జనాలు భయంతో పరుగులు పెడుతున్నారు. దాని వెనకాల ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆ జంతువును వింతగా చూస్తున్నారు. రైనో రోడ్లపై పరిగెడుతుంటే.. వీధి కుక్కలు సైతం పరుగులు తీస్తున్నాయి. కానీ, ఆ ఖడ్గమృగం ఎవరికీ ఎలాంటి హానీ చేయలేదు. దాని దారిన అది పరిగెడుతూ పోతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని అప్‌లోడ్ చేసినప్పటి నుండి 7.5K పైగా వ్యూస్‌ని సంపాదించింది. నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.
One horn Rhino
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more