Corbevax gets nod as booster after Covishield, Covaxin కరోనా బూస్టర్ డోసుగా కోర్బెవాక్స్... కేంద్రం అనుమతి

Corbevax approved as booster dose for adults vaccinated with covaxin covishield

union health ministry, rajesh bhushan, corbevax vaccine, who approval, Corbevax, Covaxin, Covishield, Corona vaccine, Covid-19 Vaccine, booster dose, covid-19, covid vaccination, dgci, emergency use, Emergency Use Listing, WHO, World Health Organisation, Omicron, deltacron

The Centre has approved Biological E's Corbevax as a precaution dose after completion of six months from the date of administration of the second dose of either Covaxin or Covishield vaccines for the population above 18 years, said Union health secretary Rajesh Bhushan.

కొవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్నవారికి బూస్టర్ డోసుగా కోర్బెవాక్స్... కేంద్రం అనుమతి

Posted: 08/10/2022 07:45 PM IST
Corbevax approved as booster dose for adults vaccinated with covaxin covishield

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కొనసాగుతోంది. వాక్సీన్ అందుబాటులోకి రాగానే ఫ్రంట్ లైన్ వారియర్స్ సహా 60 ఏళ్లకు పైనున్న పెద్దలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారినపడిన వారికి ఇచ్చారు. ఆ తరువాత 45ఏళ్ల పైబడిన వారికి ఆ తరువాత 18 ఏళ్ల పైబడిన వారికి ఇక తాజాగా ఐదేళ్ల పైబడిన చిన్నారుకు కూడా కరోనా టీకాలను ఇస్తూ.. దేశంలోని అందరినీ కరోనా నుంచి విముక్తులను చేస్తున్నారు. ఈ క్రమంలో రెండో డోసును కూడా దాదాపు దేశప్రజలందరికీ ఇచ్చారు. ఇక తాజాగా కూడా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రబలుతోంది.

దీంతో దేశంలో 60 ఏళ్ల పైబడినవారందికీ కరోనా బూస్టర్ డోసులు ఉచితంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే 60 ఏళ్ల లోపు వావరైనా కరోనా బూస్టర్ డోస్ తీసుకోవాలంటే.. వారు తప్పకుండా డబ్బులు పెట్టుకుని తీసుకోవాల్సిందే. అయితే 75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జులై 15 నుంచి 75 రోజుల పాటు అనగా అక్టోబర్ 13 వరకు దేశప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వాక్సీన్ అందిస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా ముందుగా ఏ వాక్సీన్ తీసుకున్న వారు అదే వాక్సీన్ తోసుకోవాలన్న నిబంధనలు కొనసాగుతున్న తరుణంలో కాసింత వెసలుబాటు కల్పించింది కేంద్రం.

గతంలోని రెండు డోసులు కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ లను రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసుగా కోర్బెవాక్స్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 18 ఏళ్లకు పైబడిన వారు కొవాగ్జిన్ గానీ, కొవిషీల్డ్ గానీ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత కోర్బెవాక్స్ ను బూస్టర్ డోసుగా ఇవ్వొచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ప్రధాన వ్యాక్సిన్ కాకుండా బూస్టర్ డోసుగా మరో వ్యాక్సిన్ కు అనుమతి ఇవ్వడం దేశంలో ఇదే ప్రథమం. కోర్బెవాక్స్ ను హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్-ఈ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles