Red alerts issued in seven districts of Telangana రెడ్ అలర్ట్: రానున్న రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు

Red orange yellow alerts issued in seven districts of telangana

red alert to seven districts of Telangana, India Meteorological Department (IMD), red alert to Adilabad, red alert to Kumram Bheem Asifabad, red alert to Mancherial, red alert to Nirmal, red alert to Jagtial, red alert to Jayashankar Bhupalpally, orange alert to seven districts of Telangana, Nizamabad, Rajanna Sircilla, Karimnagar, Peddapalli, Mulugu, Bhadradri Kothagudem, Siddipet districts, Yellow alert to remaining districts of telangana, Yellow alert to Hyderabad

A red alert has been sounded in seven districts of Telangana by the India Meteorological Department (IMD) on Monday as incessant rain continued to hit different parts of the State. The weather department issued a red alert till 8:30 am on Tuesday in the districts of Adilabad, Kumram Bheem Asifabad, Mancherial, Nirmal, Jagtial and Jayashankar Bhupalpally.

రాష్ట్రానికి రెడ్‌ అలెర్ట్‌ జారీ.. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు

Posted: 08/08/2022 07:59 PM IST
Red orange yellow alerts issued in seven districts of telangana

తెలంగాణ సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం పేర్కొంది. ఈ మేరకు రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, సిద్ధిపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌.. ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

పలుచోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్‌, హన్మకొండ, వరంగల్‌, జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను ప్రకటించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ వాఖ వివరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles