Mother and Son to join Govt jobs together తల్లీకొడుకులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం

Kerala woman son to join government service together

Mother son government service, Kerala Public Service Commission (KPSC), Last Grade Servants (LGS), Lower Divisional Clerk (LDC), PSC aspirant, Bindhu, anganwadi teacher, police exam, Malappuram, Kerala, government jobs. sarkari job, state govt job

Bindu began reading books to encourage her son to read when he was in class 10, but it also prompted her to prepare for the Kerala Public Service Commission (PSC) exams. Nine years down the line, both she and her son are set to enter government service together. While 42-year-old Bindu cleared the Last Grade Servants (LGS) exam with a rank of 92, her 24-year-old son cleared the Lower Divisional Clerk (LDC) exam with a rank of 38.

తల్లీకొడుకులకు ఒకేసారి కలిసోచ్చిన కాలం.. ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగం.!

Posted: 08/08/2022 07:57 PM IST
Kerala woman son to join government service together

గవర్నమెంటు జాబ్ కోసం దేశవ్యాప్తంగా ఎందరెందరో విద్యార్థులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వమైనా.. లేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైనా తమకు లభిస్తే.. తమకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని.. దీంతో ఇక తమ జీవితం సెటిల్ అయిపోయినట్టేనని భావిస్తారు. ఇక పెళ్లికాని వారికి ఇలా ఉద్యోగం వచ్చిందంటే ఎంతోమంది తమ పిల్లను ఇచ్చేందుకు క్యూ కడుతుంటారు. అంతటి మహత్మం కలిగినది ప్రభుత్వ ఉద్యోగం. సరిగ్గా నెల తిరిగే సరికి జీతం.. కారులో తిరిగేందుకు అలవెన్సులు.. అద్దె ఇళ్లకు హెచ్ఆర్ఏలు, కరువుకాటకాలను అధిగమించేందుకు డీఏ అలవెన్సులు.. పిల్లల విద్యకు కూడా అలవెన్సులు, ఆసుపత్రులలో చూయించుకునేందుకు అలవెన్సులు.. ఇలా ఒకటా రెండా.. ఎన్నోన్నో ప్రయోజనాలు.

ఇన్న ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే.. యువత నిరంతరం వాటిని టార్గెట్ చేసుకుని ఎలాగైనా జాబ్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తుంటారు. వీరికి వారి తల్లిదండ్రులు కూడా తోడవుతారు. తమ బిడ్డ ఏదైనా రాలేదు అని అనగానే దానిని తమకు తెలిసిన సాధనాల ద్వారా తెలుసుకుని వాటిని వివరణాత్మకంగా వారికి వివరిస్తారు. ఇలా తమ బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగం కొట్టేందుకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తారు. ఎంతలా అంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం తమ బిడ్డ కాదు.. ఏకంగా తామే రాస్తున్నామన్నట్లుగా ప్రిమేరవుతారు. తమ బిడ్డలను ఎంతో క్లిష్టమైన ప్రశ్నలను సంధిస్తుంటారు. అవి వారికి రాకపోతే వారే సమాధానాలు చెబుతుంటారు.

ఇలా ప్రతి ఇంట్లోనూ చదువుకున్న తల్లి ఉంటే ఈ ప్రయోజనాలు సమకూరినట్టే. అయితే తాము చదువుకునే రోజుల్లో ఇంతలా కష్టపడి ఉంటే ప్రభుత్వ ఉద్యోగం బిడ్డలకు కాకుండా తమకే వచ్చేదనేలా కూడా ఇతర కుటుంబసభ్యులు చమత్కారంగా అంటుంటారు. ఇదిలాఉంటే ఇంట్లో ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు ఉండవు. ఒక్కోసారి ఒకే ఇంట్లో ఇద్దరు, లేదా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు. ఇప్పటికీ భారత దేశంలోని పలు గ్రామాలు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగి ఉన్న గ్రామాలుగా నిలువగా.. అనేక గ్రామాలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా ఉన్నాయి.

అయితే కేరళలో బిడ్డను ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ చేసిన తల్లి కూడా.. కొడుకుతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. దీంతో ఆ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిసాయి. మలప్పురం ప్రాంతానికి చెందిన బిందు అనే మహిళ, ఆమె కుమారుడు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. బిందు తన కుమారుడు 10వ తరగతి చదువుతున్న సమయంలో అతడిని ప్రోత్సహించేందుకు పుస్తకాలు చదవటం ప్రారంభించారు. అదే ఆమెను కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(పీఎస్‌సీ) పరీక్షలవైపు మళ్లించింది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడితో పాటు ఉద్యోగం సాధించారు.  42 ఏళ్ల బిందు.. లాస్ట్‌ గ్రేడ్‌ సర్వెంట్‌(ఎల్‌జీఎస్‌) పరీక్షలో 92వ ర్యాంకు సాధించారు.

24 ఏళ్ల ఆమె కుమారుడు లోవర్‌ డివిజనల్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ) పరీక్షలో 38వ ర్యాంక్‌ సాధించాడు. ఈ విషయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు బిందు. కుమారుడిని ప్రోత్సహించేందుకు చదువు మొదలు పెట్టిన బిందు.. ఆ తర్వాత కోచింగ్‌ సెంటర్‌లో చేరారు. కుమారుడి డిగ్రీ పూర్తవగానే అతడిని సైతం కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించారు. రెండు సార్లు ఎల్‌జీఎస్‌, ఒకసారి ఎల్‌డీసీ పరీక్ష రాసినా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. నాలుగో సారి విజయాన్ని అందుకున్నారు. అయితే.. తన లక్ష‍్యం ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పరీక్ష అని... ఎల్‌జీఎస్‌ బోనస్‌ అని పేర్కొన్నారు బిందు. గత 10 ఏళ్లుగా అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles