Independence Day: Delhi Police's security arrangements ఢిల్లీలో హై అలర్ట్‌..! భారీగా బలగాల మోహరింపు..

Independence day celebrations 2022 delhi police s security arrangements

Azadi ka Amrit Mahotsav, delhi police, Independence Day 2022, Red Fort, Intelligence Bureau, Independence Day celebrations, IDay celebrations in Delhi, security arrangement in Delhi, security arrangements, Delhi, Crime

With India all set to commemorate its 75th Independence Day on August 15 this year, Delhi Police has also beefed up security arrangements in the national capital ahead of the big day. Like every year, Delhi Police said it has made elaborate security arrangements for Independence Day, which would be “flawless and foolproof”.

ఐబీ హెచ్చరికలు: ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు.. బలగాల మోహరింపు

Posted: 08/09/2022 11:43 AM IST
Independence day celebrations 2022 delhi police s security arrangements

స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశాలు ఉంటాయని ఇంటెలిజెన్స్ బ్యూరో ఇటీవల హెచ్చరించిన క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. అజాదీకే అమృత్ మహోత్సవ్ పేరిట నిర్వహిస్తున్న స్వాత్రంత్య దినోత్సవ వేడుకల నిర్వహణకు ఎలాంటి విఘాతం కలగకుండా అప్రమత్తమైన పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పదివేల మంది బలగాలను పోలీసులు మోహరించారు. గాలిపటాలు, బెలూన్లు ఎగురవేయకుండా అడ్డుకునేందుకు 400 మంది సైనికులను ప్రత్యేకంగా నియమించారు.

ఎర్రకోట, ఢిల్లీ పోలీస్‌ కమాండోల చుట్టూ ఉన్న ఎత్తయిన భవనాలను స్వాధీనం చేసుకొని.. వాటిపై షూటర్లను మోహరించనున్నారు. అలాగే ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న రోహింగ్యాల కాలనీలను పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 15న భూమి నుంచి ఆకాశం వరకు అన్నింటిపై నిఘా వేస్తామని ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ కమిషనర్‌ దీపేందర్‌ పాఠక్‌ పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ వచ్చిన సమాచారం మేరకు.. అన్ని భద్రతా సంస్థల సమన్వయంతో ఎర్రకోట వద్ద సెక్యూరిటీ సర్కిల్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సారి ఎర్రకోట చుట్టుపక్కల నో ఫ్లయింగ్‌ జోన్‌ అమలులో ఉంటుందని.. గాలిపటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురడంపై నిషేధం ఉంటుందన్నారు.

అలాగే వెయ్యికిపైగా అత్యాధునిక సీసీకెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కెమెరాలతో సందర్శకులపై నిఘా వేయనున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలు, సలహాలు పాటించాలని.. ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. మరో వైపు ఈ నెల 13 నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసివేసి.. తనిఖీలు చేపట్టనున్నారు. 15న రోహింగ్యాల కాలనీల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలకు సమాచారం అందింది. ఈ మేరకు ఆయా కాలనీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పోలీస్‌ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles