Centre Spending Billions To Polish Image Of "Arogant King": Rahul Gandhi అహంభావ రాజు కళ్తకు ధరల మోత కనబడదు: రాహుల్ గాంధీ

Govt blinded by ego how will they see inflation rahul gandhi on price rise debate

Rahul Gandhi, epidemic of unemployment, GST, Inflation, polish the image, Narendra Modi, arrogant king, facebook post, Congress, BJP, Union Government, blindfolded their eyes with ego, selling assets of country, Free Fund, recession or stagflation, NDA, UPA, National Politics

The country is battling an "epidemic of unemployment" with crores of families left with no means of a stable income but the government is spending billions just to polish the image of an "arrogant king", Congress leader Rahul Gandhi said. In a Facebook post in Hindi, Mr Gandhi said the Congress had tried to get the government to answer the questions of the people. However, everyone saw how Opposition MPs were suspended, arrested for protests and the House adjourned.

అహంభావ రాజు ప్రతిష్టకు మెరుగులు.. ధరల మోత కనబడదు: రాహుల్ గాంధీ

Posted: 08/02/2022 06:35 PM IST
Govt blinded by ego how will they see inflation rahul gandhi on price rise debate

అహంభావంతో కండ్లు మూసుకుపోయిన బీజేపీ ప్ర‌భుత్వానికి దేశంలో ఎగ‌బాకిన ద్ర‌వ్యోల్బ‌ణం ఎలా కనిపిస్తుంది.. ప్రజల ఇబ్బందులు ఎలా కనిపిస్తాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. దేశ ఆస్తుల‌ను మోదీ ప్ర‌భుత్వం తమ సంప‌న్న స్నేహితుల‌కు దోచిపెడుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు, ఇంధన ధరలు, గ్యాస్ సిలిండర్ ధర ఇలా అన్ని పెంచుకుంటూ పోతున్న కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక అహంభావంతో మూర్తింభవించిన రాజు ప్రతిష్టను మసకబారకుండా చేసేందుకే ఆ డబ్బను వెచ్చిస్తుందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.

లోక్‌స‌భ‌లో ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై చ‌ర్చ అనంత‌రం రాహుల్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్ ఆర్ధిక మాంద్యంలోకి ప‌డిపోయే ప్ర‌స‌క్తే లేద‌ని ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బదులిచ్చిన క్ర‌మంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం లేద‌ని బీజేపీ ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌లో చెబుతోంద‌ని, కాషాయ పాల‌కుల కళ్ల అహంభావంతో మూసుకుపోతే వారికి ఈ ధరల పెరుగుదల ఎలా కనబడుతోందని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. దేశంలో నిరుద్యోగం మహమ్మారిలా మారుతోందని, యువత ఉద్యోగ అవకాశాలు లేక నైరాశ్యంలోకి జారుకుంటున్నారని రాహుల్ అన్నారు.

దేశం స్వాతంత్ర్య వచ్చిన నాటి నుంచి తనకు తానుగా అర్జించుకున్న లక్షల కోట్ల రూపాయల ఆస్తులను కేంద్రంలోని ప్రభుత్వం దేనికి వెచ్చిస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇది చాలదన్నట్లు దేశంలోకి కొత్తగా లక్షల కోట్ల అప్పులు తీసుకువచ్చి ఎవరిని ఉద్దరిస్తోందని ఆయన నిలదీశారు. ఇక మరోవైపు కోట్లాది పేదల కుటుంబాలను ధరాఘాతానికి బలిచేస్తూ వారిని పేదలుగా మార్చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. 2019 నుంచి ఇప్ప‌టికి పెట్రోల్‌, డీజిల్ స‌హా నిత్యావ‌స‌ర ధ‌ర‌లు మంటెక్కిన తీరును ఈ పోస్ట్‌లో రాహుల్ గాంధీ వివ‌రించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles