PM Modi's brother Prahlad Modi stages dharna ఢిల్లీలో ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ ధర్నా..! కారణం ఏంటంటే..?

Pm modi s brother prahlad modi protests with fair price shop dealers in delhi

PM Modi’s brother, Prahlad Modi, Prahlad Modi stages dharna with fair price shops dealers, Prahlad Modi at Jantar Mantar Dharna, Prahlad Modi in Delhi, Prahlad Modi, Narendra Modi Brother Prahlad Modi, Fair Price Shop Dealers Protest, Jantar Mantar Protest, Delhi

Prime Minister Narendra Modi's brother Prahlad Modi, who is also the vice president of All India Fair Price Shop Dealers' Federation, today sat in protest at Delhi's Jantar Mantar over various demands of the organisation. Prahlad Modi along with several other members of the All India Fair Price Shop Dealers' Federation (AIFPSDF) gathered at Delhi's Jantar Mantar, holding banners and raising slogans.

ఢిల్లీలో ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ ధర్నా..! కారణం ఏంటంటే..?

Posted: 08/02/2022 05:42 PM IST
Pm modi s brother prahlad modi protests with fair price shop dealers in delhi

దేశ రాజధానిలో ప్రధాని నరేంద్రమోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే ఢిల్లీలోని అధికార అమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా కాదు. ఎకంగా తన సోదరుడు ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతర్‌ మంతర్‌ వద్ద ఆయన ధర్నా చేపట్టారు. అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం ఉపాధ్యక్షుడు ప్రహ్లాద్‌ మోదీ.. రేషన్ డీలర్ల సంఘం తరపున ధర్నా చేపట్టారు. వారితో పాటుగా ఢిల్లీకి చేరుకున్న ప్రహ్లాద్ మోడీ.. గత పదేళ్ల కాలంగా జీవన వ్యయం పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్ దుకాణాలు నడవడం కష్టంగా మారిందన్నారు. రేషన్ దుకాణాల డీలర్లకు కమీషన్ పెంచాలని డిమాండ్ చేశారు.

రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలు, పంచదారపై కేంద్ర ప్రభుత్వం తమకిచ్చే కమిషన్‌లో కిలోకు 20 పైసలు మాత్రమే పెంచడం క్రూరమైన హాస్యమని ప్రహ్లాద్ మోదీ విమర్శించారు. తమకు ఉపశమనం కల్పించి.. ఆర్థికకష్టాలను తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం ఏఐఎఫ్‌పీఎస్‌డీఎఫ్‌ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తామని, దాని ఆధారంగా తమ తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఏఐఎఫ్‌పీఎస్‌డీఎఫ్ ప్రతినిధి బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మెమోరాండం సమర్పించనున్నట్లు తెలిపారు.

మరో వైపు బుధవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో సమావేశం కానున్నట్లు ఏఐఎఫ్‌పీఎస్‌డీఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి బిశ్వంభర్‌ బసు పేర్కొన్నారు. అయితే, పశ్చిమబెంగాల్‌లో అనుసరిస్తున్న దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్న వారికి రేషన్ షాపుల్లో సబ్సిడీ ధరల్లో బియ్యం, గోధుమలు, పంచదార, అమ్మేందుకు అనుమతినివ్వాలని ఏఐఎఫ్‌పీఎస్‌డీఎఫ్‌ డిమాండ్‌ చేస్తున్నది. దీంతో పాటు గ్యాస్ సిలిండర్లు, పప్పు దినుసులు, వంటనూనెలు కూడా రేషన్ షాపుల ద్వారా అమ్మేలా కేంద్రం చర్యలు చేపట్టాలని ఏఐఎఫ్‌పీఎస్‌డీఎఫ్‌ డిమాండ్‌ చేస్తున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles