Crores kept in my flats without my knowledge: Arpita Mukherjee ఫ్లాట్‌లో ప‌ట్టుబ‌డిన న‌గ‌దుపై అర్పితా ముఖ‌ర్జీ కీల‌క వ్యాఖ్య‌లు

Arpita mukherjee s stunning claim rs 49 8 crore kept in my flats without my knowledge

Arpita Mukherjee, ED Custody, Bengal minister, Partha Chatterjee, teacher recruitment scam, Enforcement Directorate, cash seized from flats, Tollygunge, Belgharia, Kolkata, CCTV footage, Belgharia’s Club Town Heights apartment, West Bengal, Crime

Arrested West Bengal minister Partha Chatterjee's close aide Arpita Mukherjee has claimed that the cash seized from her flats in Kolkata does not belong to her. During interrogation by the Enforcement Directorate, Mukherjee said the Rs 49.8 crore cash seized from her two flats in Tollygunge and Belgharia was kept during her absence and she has no idea about it

టీచ‌ర్స్ రిక్రూట్‌మెంట్ స్కాం: ప‌ట్టుబ‌డిన న‌గ‌దుపై అర్పితా ముఖ‌ర్జీ కీల‌క వ్యాఖ్య‌లు

Posted: 08/02/2022 07:27 PM IST
Arpita mukherjee s stunning claim rs 49 8 crore kept in my flats without my knowledge

టీచ‌ర్స్ రిక్రూట్‌మెంట్ స్కాంకు సంబంధించి పార్ధా ఛ‌ట‌ర్జీ స‌న్నిహితురాలు అర్పితా ముఖ‌ర్జీని అదుపులోకి తీసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. అమెకు రెండో పర్యాయం ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు తరలిస్తుండగా, అమె కారు దిగకుండా మారం చేసింది. అంతేకాదు తనను వదిలిపెట్టాలని తనకు ఏ పాపం తెలియదని, తనను అనవసరంగా కేసులో ఇరికిస్తున్నారని.. అక్రమంగా తనపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించిన అమె.. తనను బలవంతంగా ఆసుపత్రికి తరలిస్తుండగా, వీల్ చైర్ పై బోరున విలపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే అటు సామాజిక మాద్యమాలతో పాటు ఇటు మీడియాలోనూ విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇలా ఈడీ కేసులంటేనే తీవ్రంగా భయపడిన ఆమె.. తాజాగా తమ ధోరణి మార్చేశారు. తన నివాసాల్లో ఈడీ స్వాదీనం చేసుకున్న రూ 50 కోట్ల న‌గ‌దుపై అర్పిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను లేని స‌మ‌యంలో త‌న ఫ్లాట్‌లో డ‌బ్బును ఉంచార‌ని ఆమె చెప్పుకొచ్చారు. టీచ‌ర్స్ రిక్రూట్‌మెంట్ స్కాంలో అరెస్ట‌యిన బెంగాల్ మాజీ మంత్రి పార్ధా ఛ‌ట‌ర్జీ ఆయ‌న స‌న్నిహితురాలు అర్పితా ముఖ‌ర్జీల‌ను ఆగ‌స్ట్ 3 వ‌ర‌కూ ఈడీ క‌స్ట‌డీకి న్యాయ‌స్ధానం త‌ర‌లించింది. జులై 22న అర్పితా నివాసంపై ఈడీ దాడుల్లో రూ 21.90 కోట్ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. రూ 56 ల‌క్ష‌ల విదేశీ న‌గ‌దు, రూ 76 ల‌క్ష‌ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఆపై అర్పిత మ‌రో ఫ్లాట్‌లో జ‌రిపిన దాడుల్లో రూ 28.90 కోట్ల న‌గ‌దు ప‌ట్టుబ‌డింది. ఐదు కిలోల బంగారం, ప‌లు కీల‌క ప‌త్రాల‌ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో ప‌ట్టుబ‌డిన న‌గ‌దు, బంగారం టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ స్కాం ద్వారా రాబ‌ట్టిన ముడుపుల సొమ్ముగా భావిస్తున్నారు. ఇక ఈ సొమ్ము త‌న‌ది కాద‌ని, త‌న‌కు వ్య‌తిరేకంగా కుట్ర జ‌రిగింద‌ని పార్ధ ఛ‌ట‌ర్జీ ఆరోపిస్తున్నారు. టీచ‌ర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్ వెలుగుచూసిన నేప‌ధ్యంలో పార్ధ ఛ‌ట‌ర్జీని పార్టీ ప‌ద‌వుల నుంచి టీఎంసీ త‌ప్పించ‌గా, మ‌మ‌తా కేబినెట్ నుంచి కూడా ఆయ‌న‌ను తొల‌గించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles