బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నా ఉగ్రదాడి కుట్ర వ్యవహారంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది. దర్భంగాలోని ఉగ్రవాద అనుమానితులైన సనావుల్లా, నూరుద్దీన్, ముస్తాఖీం ఇండ్లపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)లో క్రియాశీలక సభ్యులైన ఈ ముగ్గురు నిందితుల ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో నూరిద్దీన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేశారు. దీంతో నూరిద్దీన్ ప్రస్తుతం పాట్నా జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉండగా, మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని అధికారులు వెల్లడించారు.
దర్భంగా సహా ఉత్తర్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకునే చర్యల్లో భాగంగా ఎన్ఐఏ మూడు బృందాలను ఏర్పాటు చేసింది. పాట్నా ఉగ్రదాడి మాడ్యూల్‌ను బీహార్ పోలీసులు జులై 14న ఛేదించారు. అదే రోజున అథర్ పర్వేజ్ ను అదుపులోకి తీసుకోవడంతో ఈ ఉగ్రకుట్ర బట్టబయలైంది. ఈ కుట్రలో జార్ఖండ్ కు చెందిన రిటైర్డు పోలీసు అధికారి మహమ్మద్ జలాలుద్దీన్ పాత్ర కూడా ఉండటం పోలీసులను విస్మయానికి గురిచేసింది. ఆయనను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసలు రిమాండ్ కు తరలించారు.
హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న యావత్ భారతావనిని 2047 నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్రపూరితంగా వ్యవహరించడంతో పాటు దేశప్రధాని నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకోవాలని దాడులకు పాల్పడాలని అరెస్టైయిన ముగ్గరితో పాటు పరారీలో ఉన్న ఇద్దరు ముష్కరులు కూడా కుట్ర పన్నారని పోలీసులు చెప్పారు. కాగా, ఈ కేసును కేంద్ర హోంశాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది. దీంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కు చెందిన 26 మంది అనుమానిత ఉగ్రవాదుల పేర్లతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా ఈ ఉగ్రకుట్రకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలినవారు పరారీలో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more