TSPSC Assistant MVI Recruitment 2022 తెలంగాణలో అసిస్టెంట్​ ఎంవీఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​

Tspsc notifies 113 vacancies of assistant motor vehicle inspector

Assistant Motor Vehicle Inspector, Assistant Motor Vehicle Inspector jobs, AMVI Jobs Notification, Telangana Jobs, TSPSC, Telangana jobs Notification, sarkari jobs, telangana government jobs, jobs in Telangana state government, Telangana Govt jobs, sarkari naukri

The Telangana State Public Service Commission (TSPSC) issued a notification for general recruitment to 113 vacancies of Assistant Motor Vehicle Inspector in the Transport department. Interested and qualified candidates can submit the application which will be made available on the Commission website www.tspsc.gov.in between August 5 and September 5.

తెలంగాణలో అసిస్టెంట్​ ఎంవీఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​

Posted: 07/28/2022 12:42 PM IST
Tspsc notifies 113 vacancies of assistant motor vehicle inspector

తెలంగాణలోని నిరుద్యోగ యువతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు, విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఆశలు రేపిన ప్రభుత్వం తాజాగా రాష్ట్ర రవాణాశాఖలోని ఉద్యోగాల కోసం కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. రవాణా శాఖ పరిధిలో మొత్తంగా 113 ఏఎంవీఐ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్ పీఎస్సీ) ప్రకటించింది.

తెలంగాణలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టులకు ఆగస్టు 5 వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్ పీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు. అభ్యర్థుల అర్హతలు, ఇతర అంశాలు, నోటిఫికేషన్  పూర్తి వివరాలను టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ www.tspsc.gov.in లో పొందవచ్చని తెలిపారు.

తెలంగాణలో మొత్తంగా 80 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారని.. అందులో భాగంగానే ఇప్పటికే పలు నోటీఫికేషన్లు విడుదల కాగా, తాజాగా రవాణా శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో వేగంగా అడుగులు వేస్తోందని.. ఇప్పటికే గ్రూప్‌-1, పోలీసు శాఖతోపాటు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిందని పేర్కొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles