Student Massaging Video: Teacher Suspended ఉపాధ్యాయురాలి ఉద్యోగంపై వేటేసిన విద్యార్థి మసాజ్ వీడియో.!

Up teacher suspended after video of student massaging her goes viral

Uttar Pradesh teacher, government school teacher, Hardoi Teacher suspended, Hardoi Teacher Urmila Singh, assistant teacher Urmila Singh, viral video, uttar pradesh, uttar pradesh news, Uttar Pradesh Crime news, School teacher, assistant teacher, Urmila Singh, bicep massage, Suspension, Student, Uttar Pradesh, viral video

A government school teacher in Uttar Pradesh’s Hardoi was suspended after a video went viral on social media where she was seen receiving a massage from student. The incident took place at Pokhari Primary School in Hardoi. The teacher has been identified as Urmila Singh, an assistant teacher at the school. The teacher was suspended soon after the video went viral.

ITEMVIDEOS: టీచర్ ఉద్యోగంపై సస్పెన్షన్ వేటుపడిన విద్యార్థి మసాజ్ వీడియో.!

Posted: 07/28/2022 04:06 PM IST
Up teacher suspended after video of student massaging her goes viral

విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పడంతో పాటు వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. ఉత్తమ పౌరులుగా కాకపోయినా రేపటి పౌరులకు కనీసం విద్యను చక్కగా బోదిస్తే చాలు అంటున్నారు కొందరు తల్లిదండ్రులు. తమకు పాఠాలు నేర్పే గురువులు బదిలీపై పాఠశాలను, తమను వదిలివెళ్తుంటే.. పిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటూ అడ్డుకునే దృశ్యాలను చాలానే చూశాం. తమ టీచర్లను బదిలీపై వెళ్లనివ్వబోమని ఏకంగా మాస్టారును ఘెరావ్ కూడా చేస్తారు కొందరు విద్యార్థులు. మరికోందరు విద్యార్థులు  మరో అడుగు ముందుకేసి మరీ అధికారులకు కూడా తమ విన్నపాలను తెలియజేస్తుండటం చూస్తున్నాం.

అదే సమయంలో ఉపాధ్యాయ వృత్తికి కళంకం తీసుకువచ్చే వాళ్లు లేకపోలేదు. ఆశ్రమపాఠశాలల్లో విద్యార్థులకు అస్త్ర,శస్త్ర విద్యాలను నేర్పిన మహారుషులకు విద్యార్థులు సుశృత సేవ చేయడం పరిపాటి. కానీ నేటి తరం విద్యార్థులకు ఆ సేవ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ఇక్కడ ఓ టీచర్ మాత్రం దానిని నేర్పించాలనుకుంది. తరగతి గదిలో అదీ.. పిల్లలందరి ముందే ఓ టీచర్‌ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. స్టూడెంట్స్‌లోని ఓ పిల్లాడితో చేతులను మసాజ్‌ చేయించుకుంది. హాయిగా కుర్చీలో రిలాక్స్‌ అవుతున్న వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది.

దీంతో.. సదరు టీచర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఉత్తర ప్రదేశ్‌ హర్దోయ్‌ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఉర్మిలా సింగ్‌ ఆ స్కూల్‌లో అసిస్టెంట్‌ టీచర్‌గా పని చేస్తోంది. వీడియో వైరల్‌ అయిన వెంటనే ఆమెపై వేటు వేస్తూ జిల్లా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వీడియో తనదాకా వచ్చిందని, ఆమెపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, కానీ, ఆమె వ్యవహరించిన తీరుపై తగిన చర్యలు ఉంటాయని చెప్పారు హర్దోయ్‌ విద్యాధికారి బీపీ సింగ్‌. అయితే తల్లిదండ్రులు మాత్రం ఆమెను స్కూల్‌ నుంచి తొలగిస్తేనే.. తమ పిల్లలను బడికి పంపుతామంటూ ధర్నా చేపట్టారు అక్కడ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles