NEET exam: Students asked to remove innerwear in Kerala నీట్ పరీక్షల్లో విద్యార్థుల లోదుస్తులు విప్పి తనిఖీలు..

Kollam girls asked to remove inner wear to write neet exam complaint filed

female students, NEET exam, remove innerwear, frisking process, Marthoma Institute of Information Technology, Sooranad, Ayur, Kollam district, Kerala, Crime

A female students in Kerala's Kollam district was humiliated as they were forced to remove her inner-wear before appearing for the NEET 2022 medical entrance examination. The father of one girl, a native of Sooranad, has filed a complaint with the police against the harassment his daughter had to face. The incident took place at the exam centre in Marthoma Institute of Information Technology, Ayur.

అమానుషం: నీట్ పరీక్షల్లో విద్యార్థుల లోదుస్తులు విప్పి తనిఖీలు..

Posted: 07/18/2022 05:09 PM IST
Kollam girls asked to remove inner wear to write neet exam complaint filed

దేశవ్యాప్తంగా క్రితంరోజున మెడిక‌ల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్-2022 నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే కేర‌ళ‌లోని ఓ ఎగ్జామ్ సెంట‌ర్‌లో విద్యార్థినుల ప‌ట్ల అక్క‌డున్న సిబ్బంది అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. కట్టుదిట్ట ఏర్పాట్ల నడుమ పరీక్షలను నిర్వహించామని చెప్పుకుంటున్న సిబ్బంది.. విద్యార్థినుల పట్ల ఎంతో దిగజారి వ్యవహరించారు. సభ్యసమాజం తలదించుకునేలా అక్కడి సిబ్బంది వ్యవహరించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరీక్షా కేంద్రంలోనికి వస్తున్న విద్యార్థినుల లో దుస్తులు విప్పిన త‌ర్వాతే వారిని ప‌రీక్షా కేంద్రంలోకి అనుమ‌తించారు. ఈ ఘ‌ట‌న‌పై బాధిత విద్యార్థినులు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. కేర‌ళ కొల్లాంలోని మార్తోమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ కాలేజీలో నీట్ ఎగ్జామ్ నిర్వ‌హించారు. ఈ కేంద్రంలో ప‌రీక్ష‌కు హాజ‌రైన సుమారు 100 మంది విద్యార్థినుల ప‌ట్ల సిబ్బంది అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. అమ్మాయిలంద‌రూ లో దుస్తులు విప్పాల‌ని ఆదేశించారు. ఎగ్జామ్‌కు స‌మ‌యం అవుతుండ‌టంతో.. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో విద్యార్థినులంద‌రూ లో దుస్తులు విప్పి.. ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. అక్క‌డ ఓ డ‌బ్బాలో లో దుస్తులు ఉంచిన దృశ్యాలు క‌నిపించాయ‌ని ప‌రీక్ష అనంత‌రం విద్యార్థినులు పేర్కొన్నారు.

అయితే ఈ ఘ‌ట‌న‌పై ప‌రీక్షా కేంద్రం సిబ్బందిని వివ‌ర‌ణ కోరగా.. లో దుస్తులకు బెల్ట్స్ వంటి ప‌రిక‌రాలు ఉండ‌టం వ‌ల్లే అలా చేయాల్సి వ‌చ్చింద‌ని స‌మ‌ర్థించుకున్నారు. అలాగే ప‌రీక్షా కేంద్రంలోని సాధారణ చెప్పులను మాత్రమే అనుమతించారు. ఆభరణాలు, మెటల్ వస్తువులు, ఎలాంటి వాచీలు, కెమెరాలు, టోపీ, బెల్ట్, పర్సు, హ్యాండ్ బ్యాగ్‌‌లకు అనుమతి ఇవ్వలేద‌ని తెలిపారు. ఇదేం కొత్త ఘ‌ట‌న కాదు.. నీట్ ఎగ్జామ్ రాసే విద్యార్థినుల‌కు ప్ర‌తి ఏడాది ఏదో ఒక చోట ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతూనే ఉంది. 2017లో త‌మిళ‌నాడులోని క‌న్నూరులో ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : female students  NEET exam  remove innerwear  frisking process  Ayur  Kollam district  Kerala  Crime  

Other Articles