Sikkim Cop Kills 3 Colleagues in Delhi Over Comments Against Wife భార్యపై అనుచిత కామెంట్లు.. సహచర పోలీసులపై కానిస్టేబుల్ తూటాలు.!

Sikkim police personnel kills three colleagues over offensive remarks against his wife

delhi murder, delhi police murder, Haiderpur water treatment plant, Indian Reserve Battalion, Samaypur Badli Police Station, Lance Naik Prabin Rai, Commander, Pinto Namgyal Bhutia, constables Indra Lal Chhetri, Dhanhang Subba, Sikkim policemen, mental harassment, Delhi, Crime

A Sikkim Police personnel killed three of his colleagues at the national capital’s Haiderpur water treatment plant in the Rohini area, allegedly over disrespectful remarks made against his wife by the deceased. The police said that the men had been deployed at the plant for its security by the Indian Reserve Battalion (IRB).

భార్యపై అనుచిత కామెంట్లు.. సహచర పోలీసులపై కానిస్టేబుల్ తూటాలు.!

Posted: 07/19/2022 11:51 AM IST
Sikkim police personnel kills three colleagues over offensive remarks against his wife

తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ పోలీసు కానిస్టేబుల్ తన ఇద్దరు సహచర కానిస్టేబుళ్లతో పాటు మరో కమాండర్ స్థాయి అధికారిని కాల్చి చంపాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగిందీ ఘటన. ఢిల్లీలోని హైదర్‌పూర్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ వద్ద భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైన పోలీసులు తరచు తన భార్యపై అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ.. అభ్యంతరకర రీతిలో కామెంట్లు చేయడంతో సహనం కోల్పోయిన 32 ఏళ్ల సిక్కిం పోలీసు కానిస్టేబుల్.. ప్రబీణ్ రాయ్ వారిపై కాల్పులు జరిపి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

హైదరపూర్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటులో చనిపోయిన ముగ్గురు పోలీసులు సిక్కిం పోలీసు విభాగానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇండియన్ రిజర్వు బెటాలియన్‌లో భాగమైన వీరందరూ ఢిల్లీలోని హైదర్‌పూర్ ప్లాంట్ వద్ద భద్రతగా ఉన్నారని తెలిపారు. కాగా, పెళ్లైన తరువాత తన భార్యతో కుటుంబ కలహాలు ఏర్పడటంతో సదరు కానిస్టేబుల్ అమెతో తరచుగా సంబాషిస్తుంటాడని, అయితే అదే అదనుగా తీసుకుని తోటి పోలీసులు అమెపై అభ్యంతరకర రీతిలో కామెంట్లు చేసేవారని నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. ఇక తాజాగా కాల్పులు జరిపే రోజు కూడా అదే విధంగా ఆయన తన భార్యకు ఫోన్ చేయగా, అమె ఫోన్ లిప్ట్ చేయలేదు.

దీంతో ఆ విషయమై మిగిలిన పోలీసులు అతడి భార్యపై అనుచిత కామెంట్లు చేయగా, సహనం కోల్పోయిన ప్రబిన్ రాయ్, తన రైఫిల్ తీసుకుని వారిపై కాల్పులు జరిపానని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ప్రబీణ్‌రాయ్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కొన ఊపిరితో ఉన్న మరొకరిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మానసిక వేధింపులకు గురిచేయడం వల్లే తాను వారిని కాల్చేసినట్టు నిందితుడు ప్రబీణ్ రాయ్ ప్రాథమిక విచారణలో వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles