Bus falls into Narmada river in Madhya Pradesh మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు..

13 dead as bus headed to pune falls into river narmada in madhya pradesh

Pune-bound bus falls into Narmada river, bus falls into Narmada river, Indore, narmada river bus accident, mp bus accident, madhya pradesh bus accident, Dhar bus accident, Dhamnod bus accident, bus accident, 12 dead, Pune bound bus, Narmada River, DHAR Accident, Bus Accident, Dhamnod, Indore, madhya pradesh, Crime

A Pune-bound bus broke through the barrier of Khalghat bridge in Madhya Pradesh’s Dhar district, around 90km from Indore, and plunged into the Narmada from a height of around 100ft. Home minister Narottam Mishra said there were 50-55 passengers on board. "Officials who reached the spot say 15 people were pulled out alive. Twelve bodies have been found. It’s very tragic,” he told mediapersons in Bhopal.

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు..

Posted: 07/18/2022 04:17 PM IST
13 dead as bus headed to pune falls into river narmada in madhya pradesh

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి దూసుకెళ్లగా.. 13 మంది ప్రయాణికులు మరణించారు. మరో 15 మందికి తీవ్రగాయాలు కాగా, స్థానికులు, రెస్క్యూ సిబ్బంది వారిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ధార్ జిల్లా ఖాల్​ఘాట్​ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఇండోర్​ నుంచి మహారాష్ట్రలోని పుణె బయలుదేరిన బస్సు.. వంతెనపై అదుపు తప్పి.. నేరుగా రక్షణ గోడును ఢీకోని నర్మదా నదిలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. మిగతావారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఖాల్‌ఘాట్‌ వద్ద ఉన్న సంజయ్‌ వంతెనపైకి రాగానే బస్సు అదుపు తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో వంతెన రక్షణ గోడను ఢీకొని సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి బస్సు నదిలోకి పడిపోయినట్లు వివరించారు. ప్రమాదం అనంతరం పలువురు ప్రయాణికులు నీటిలో గల్లంతు కాగా, మరికొందరు బస్సులోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. ప్రమాదఘటనపై మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​, హోంమంత్రి నరోత్తమ్​ మిశ్రా విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో మాట్లాడినట్లు చెప్పారు చౌహాన్​. గాలింపు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించానని సీఎం వెల్లడించారు.

ప్రమాదానికి గురైన బస్సు 10 ఏళ్లుగా సర్వీసులో ఉందని, ఫిట్​నెస్​ సర్టిఫికెట్​ కూడా 10 రోజుల్లో ముగుస్తుందని మహారాష్ట్ర ఆర్టీఓ అధికారులు వెల్లడించారు. నాగ్​పుర్​ రూరల్​ రీజనల్​ ట్రాన్స్​పోర్ట్​ ఆఫీస్​లో.. 2012, జూన్​ 12న బస్సు రిజిస్ట్రేషన్​ జరిగింది. వాహనం సక్రమంగా ప్రయాణించడానికి అనువుగా ఉందని సూచించే సర్టిఫికెట్​ గడువు ఈ జులై 27న ముగియనుందని ఆర్టీఓ పేర్కొంది. పొల్యూషన్​ అండర్​ కంట్రోల్​(పీయూసీ) సర్టిఫికెట్​, ఇన్సూరెన్స్​ చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ప్రమాదానికి గురైన బస్సును చంద్రకాంత్​ ఏక్​నాథ్​ పాటిల్​ అనే డ్రైవర్​ నడిపాడని, ప్రకాశ్​ శ్రావణ్​ చౌధరీ కండక్టర్​గా ఉన్నారని మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bus accident  12 dead  Pune bound bus  Narmada River  DHAR Accident  Bus Accident  Dhamnod  Indore  Madhya Pradesh  Crime  

Other Articles