Kerala reports India’s first confirmed monkeypox case దేశంలోకి చోచ్చుకోచ్చిన మంకీపాక్స్‌.. కేరళలో తొలికేసు నమోదు

First confirmed case of monkeypox reported in india here are the symptoms treatment

monkeypox india, monkeypox kerala, monkeypox cases india, monkeypox virus, monkeypox case confirmed, first case of monkeypox confirmed in Kerala, Kerala confirms monkeypox case, Union Health Ministry, Kerala State health ministry, State Health Departments, monkeypox in india, monkeypox in india today, monkeypox in kerala, kerala news, news about monkeypox, India reports 1st case of monkeypox in Kerala, How does a person get monkeypox, monkeypox news

A man from Kerala who recently returned from the United Arab Emirates (UAE) was on Thursday confirmed as India’s first case of monkeypox, prompting the Union government to depute a high-level multi-disciplinary team to the southern state. Kerala health minister Veena George told reporters that the case was confirmed through the testing of the samples of the symptomatic person at the National Institute of Virology, Pune.

దేశంలోకి చోచ్చుకోచ్చిన మంకీపాక్స్‌.. కేరళలో తొలికేసు నమోదు

Posted: 07/14/2022 04:28 PM IST
First confirmed case of monkeypox reported in india here are the symptoms treatment

మంకీపాక్స్‌ భారత్‌కు విస్తరించింది. ఈ మహమ్మారి తొలికేసు కేరళలో నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ ధ్రువీకరించారు. ఈ నెల 12న యూఏఈ నుంచి తిరువనంతపురానికి వచ్చిన కొల్లాంకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్‌ నిర్ధారణ అయినట్లు తెలిపారు. సదరు వ్యక్తికి లక్షణాలు కనిపించడంతో నమూనాలను పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపగా.. పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే సదరు వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించినట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 12న తిరువనంతపురానికి వచ్చిన బాధితుడు తొలుత ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు.

అనంతరం అక్కడి నుంచి తిరువనంతపురం మెడికల్‌ కాలేజీకి వెళ్లగా.. అనుమానంరావడంతో నమూనాలను సేకరించి పుణేలోని ల్యాబ్‌కు తరలించారు. మరో వైపు కేరళలో మంకీపాక్స్‌ కేసు నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది. ప్రత్యేక ఓ బృందాన్ని పంపనున్నది. మంకీపాక్స్ వైరస్ మశూచికి కారణమయ్యే వైరస్‌ల కుటుంబానికి చెందినది. కొన్ని సందర్భాల్లో జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకుతుంది. జ్వరం, విరేచనాలు, శరీరం, ముఖంపై దద్దుర్లు వస్తాయి. అనారోగ్యం నాలుగు వారాల వరకు ఉంటుంది.

గత ఏడాది జూలైలో అమెరికాలోని టెక్సాస్‌లో రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ‘మంకీపాక్స్’ కేసు నమోదైంది. ఇప్పటికే పలు దేశాల్లోనూ చాలా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్ మంకీపాక్స్‌ను మహమ్మారిగా ప్రకటించింది. మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి 59 దేశాల్లో వరకు 6వేల మందికిపైగా మంకీపాక్స్‌ సోకింది. మంకీపాక్స్‌ విస్తరణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేషన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 80శాతానికిపైగా కేసులు యూరప్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles