తమిళనాడులోని విపక్ష అన్నాడీఎంకే పార్టీలో ఏకనాయకత్వ వ్యవహారంలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల మధ్య రాజుకున్న వివాదం ఎట్టకేలకు సమసిపోయి.. ఇరువర్గాల మధ్య చిచ్చు రాజేయడంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించడంతో.. ముగిసింది. అయితే అప్పటికీ పన్నీరుసెల్వం వర్గం మాత్రం విషయాన్ని అక్కడితో వదిలిపెట్టకుండా న్యాయస్థానంలో సవాలు చేసింది. ఇదిలావుండగానే తన రాజకీయ చతురతను ప్రదర్శించేలా పన్నీరు సెల్వం ఎడపాటికి ఓ గూగ్లీని విసిరారు. దీంతో తాజాగా అన్నాడీఎంకేలో చిచ్చు రాజుకుంది. ఎడపాడి పళనిస్వామి ముందుకు.. పార్టీ నుంచి పొన్నయ్యన్‌ను బహిష్కరించాలని మాజీ మంత్రులు కొందరు అప్పుడే నిరసన గళం విప్పారు.
కన్యాకుమారి జిల్లాకు చెందిన పార్టీ నేత ఒకరు పొన్నయన్‌తో రహస్య సంభాషణ చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆడియో, ఆయనను బహిష్కరించాలనే డిమాండ్ ఎడపాడిని ఇరుకునపెట్టింది. ఆడియోలోని వివరాలు.. మాజీ మంత్రి కేపీ మునుస్వామి డీఎంకే మంత్రి దురైమురుగన్ సిఫార్సుతో క్వారీల కాంట్రాక్టు పొంది నెలకు రూ.2 కోట్లు సంపాదిస్తున్నట్లు, అలాగే మాజీ మంత్రి తంగమణి సైతం తన అక్రమాస్తులను ఏసీబీ దాడుల నుంచి కాపాడుకునేందుకు సీఎం స్టాలిన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం గురించి విమర్శలు చేసినట్లు, ఎంజీఆర్, జయలలితల గురించి అమర్యాదగా మాట్లాడినట్లు ఆ సంభాషణల్లో ఉన్నాయి.
అంతేగాక తంగమణి, వేలుమణి దొంగలు, డబ్బు, కాంట్రాక్టులు ఇచ్చి 42 మంది ఎమ్మెల్యేలను గుప్పిట్లో పెట్టుకున్నారని, వాస్తవానికి ఎడపాడికి కేవలం 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు పలుకుతున్నారని కూడా మాట్లాడారు. ఈ కారణంగా పొన్నయ్యన్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని ఎడపాడిపై మాజీ మంత్రులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆడియో సంభాషణలను పొన్నయ్యన్ ఖండించారు. సాంకేతిక పరిజ్ఞానంతో తన గొంతుకను ప్రచారంలోకి తెచ్చారని ఆరోపించారు. మాజీ మంత్రులపై తాను తప్పుగా మాట్లాడలేదని పేర్కొన్నారు. అయితే, మొత్తం ఈ ఆడియోల వివాదం కోర్టుకెక్కగా గురువారం విచారణ జరగనుంది.
పార్టీ పగ్గాలు చేజారిపోవడంతో పన్నీర్‌సెల్వం, శశికళ చేయికలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అన్నాడీఎంకే నేతలు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ రహస్యంగా కలుసుకుని మంతనాలు సాగిస్తున్నారనే సమాచారం అందడంతో నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎడపాడిపై జరుపుతున్న న్యాయపోరాటంలో నెగ్గకుంటే మరో మార్గంలో రాజకీయంగా దెబ్బకొట్టేందుకు పన్నీర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అదనుగా పన్నీర్‌ను తమవైపు తిప్పుకోవాలని జయ అన్న కుమార్తె దీప, పన్నీర్‌సెల్వంను ఇంటికి విందుకు ఆహ్వానించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఓపీఎస్ వర్గీయులు నిర్ధారించడం లేదు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more