From 'Corrupt' To 'Betrayal,' Words Banned In The Parliament ఆ పదాలు ఇకపై పార్లమెంటులో నిషేధం

Corrupt hypocrisy jumlajeevi list of words banned in parliament

unparliamentary words, Parliament, Banned Words, unparliamentary words, parliament words, parliament expression, parliament monsoon session, expunge words, banned words parliament, lok sabha banned words, parliament, lok sabha, rajya sabha, unparliamentary words, words banned in parliament, words banned lok sabha, words banned rajya sabha, parliament words, jumlajeevi parliament

'Jumlajeevi', 'baal buddhi', 'Covid spreader' and 'Snoopgate' have joined everyday expressions like 'ashamed', 'abused, 'betrayed', 'corrupt', 'drama', 'hypocrisy' and 'incompetent' in a list of words deemed unfit for parliament. Triggering instant protests from opposition lawmakers who say it will impede their ability to critique the government, the Lok Sabha secretariat has issued a new booklet listing unparliamentary words for both houses.

‘‘అవినీతిపరుడు.. అసమర్థుడు.. నియంత..’’ పదాలపైనా పార్లమెంట్‌లో నిషేధం..

Posted: 07/14/2022 03:34 PM IST
Corrupt hypocrisy jumlajeevi list of words banned in parliament

పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సర్వసాధారణం. ఈ క్రమంలో కొన్నిసార్లు సభ్యులు పదునైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే, పార్లమెంట్‌ నిబంధనల ప్రకారం కొన్ని పదాలను సభలో ఉపయోగించడంపై నిషేధం ఉంటుంది. ఇందుకు సంబంధించి లోక్‌సభ సెక్రటేరియెట్‌ తాజాగా ఓ కొత్త బుక్‌లెట్‌ విడుదల చేసింది. ఇకపై ‘జుమ్లాజీవి’, ‘కొవిడ్ స్ప్రెడర్‌’, ‘స్నూప్‌ గేట్‌’ వంటి పదాలను పార్లమెంట్‌లో వాడటం నిషిద్ధం. అంతేకాదు ఇలాంటి అనేక పదాలను కూడా పార్లమెంటులో వాడరాదని బుక్ లెట్ లో పేర్కోన్నారు.

దీంతో పాటు అతి సాధారణంగా ఉపయోగించే ‘సిగ్గు చేటు’, ‘వేధించడం’, ‘మోసగించడం’, ‘అవినీతిపరుడు’, ‘డ్రామా’, ‘హిపోక్రసీ’, ‘నియంత’ అనే పదాలను కూడా ఇకపై పార్లమెంటు ఉభయసభల్లో ఉపయోగించకూడదని పేర్కొనడం గమనార్హం. జులై 18 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో నిషేధిత పదాల జాబితాను లోక్‌సభ విడుదల చేసింది. తాజా జాబితా ప్రకారం.. ‘శకుని’, ‘తానాషా’, ‘వినాశ పురుష్‌’, ‘ఖలిస్థానీ’, ‘ద్రోహ చరిత్ర’, ‘చంచా’, ‘చంచాగిరి’, ‘పిరికివాడు’, ‘క్రిమినల్‌’ అనే పదాలు కూడా వాడరాదు.

వీటితో పాటు ‘మొసలి కన్నీళ్లు’, ‘గాడిద’, ‘అసమర్థుడు’, ‘గూండాలు’, ‘అహంకారి’, ‘చీకటి రోజులు’, ‘దాదాగిరి’, ‘లైంగిక వేధింపులు’, ‘విశ్వాసఘాతకుడు’ వంటి పదాలను కూడా సభ్యులు తమ ప్రసంగంలో ఉపయోగించకూడదు. సమయానుకూలంగా కొన్ని పదాలు, హావభావాలను పార్లమెంట్ ఉభయ సభలు, రాష్ట్రాల చట్టసభల్లో వినియోగించకుండా వాటిని అమర్యాదకరమైనవిగా ప్రకటిస్తుంటారు. రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌ వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ నిషేధిత జాబితాలో ఉన్న పదాలను సభ్యులు ఉపయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు. లోక్‌సభ సెక్రటేరియట్‌ విడుదల చేసిన తాజా జాబితాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles