SC denies blanket stay on demolition drives ‘బీరు’బాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తాజా అధ్యయన ఫలితం

Is beer good for men s gut health and can it prevent diabetes experts answer

beer for health, beer health benefits, should you drink beer, indianexpress.com, beer study news, indianexpress, beer for gut health, journal of agricultural and food chemistry, gut health, chronic diseases, CINTESIS, beer, diabetes, obesity

Drinking beer is beneficial to the intestine and has the potential to prevent chronic diseases, a new study has claimed. "Beer consumption contributes to the improvement of the composition of the intestinal microbiota, a factor that has been associated with the prevention of very common chronic diseases, such as obesity, diabetes, and cardiovascular diseases," said research.

‘బీరు’బాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తాజా అధ్యయన ఫలితం

Posted: 07/14/2022 01:42 PM IST
Is beer good for men s gut health and can it prevent diabetes experts answer

మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరమని ఇప్పటికే ఎందరో వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరికలు, సూచనలు చేశారు. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో అనేక మంది క్యాన్సర్ బారిన పడటానికి కూడా ఈ మద్యపానమే కారణమని కూడా నివేదికలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లలో కూర్చోని మద్యం సేవించి క్యాన్సర్ బారిన పడ్డారని కూడా వైద్యనిపుణులు తెలిపారు. అయితే ఇలాంటి మద్యపానానికి దూరంగా ఉండాలన్న సూచనలు కూడా తెరపైకి వచ్చాయి. అల్కాహాల్ ఎంతమాత్రం మంచిదికాదని.. మరోమారు ప్రచారం జోరందుకుంది.

అంతేకాదు దూమపానంతోనే కాకుండా మద్యపానంతోనూ క్యాన్సర్ వస్తుందన్న ప్రచారం కూడా తారాస్థాయిలో జరిగిన విషయం విధితమే. ఇలా ఎన్ని హెచ్చరికలు చేసినా.. మద్య పానప్రియులు మాత్రం అల్కహాల్ ను వదలడం లేదు.. సరికాదా.. నానాటికీ మద్యపానప్రియుల సంఖ్య పెరుగుతూ.. మద్యం అమ్మకందార్ల పంటపండిస్తోంది. ఈ ఆదాయంలో వేసవి అమ్మకాల రూటే సపరేటు. ఓ వైపు మద్యం అమ్మకాలు కొనసాగుతూనే మరోవైపు బీరు అమ్మాకాలు కూడా తారాస్థాయికి చేరి.. ఏ ఏడాదికాఏడాది రికార్డులను బద్దలు కొడుతోంది. అయితే తాజాగా బీరుబాబుల బాట్సామ్ అప్ కు ఊతమిచ్చేలా ఓ అధ్యయన ఫలితాలు వెల్లడయ్యాయి.

బీరుబాబులు తీసుకునే అరోగ్యపరంగానూ మంచిదని తాజా అధ్యయనం వెల్లడించింది. బీరు పేగులకు మంచిదని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని పోర్చుగల్ కు చెందిన ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ హెల్త్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్’ పరిశోధనలో తేలింది. బీరులో ఉండే పాలీ ఫెనాల్స్ పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావం చూపిస్తున్నట్టు తెలుసుకున్నారు. రెడ్ వైన్ లో పాలీఫెనాల్స్ వల్ల కలిగే ప్రయోజనాలను ఈ సందర్భంగా పరిశోధకులు ప్రస్తావించారు. బీరుతో పేగుల్లోని బ్యాక్టీరియా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బులను నివారించడంలో ఈ బ్యాక్టీరియా పాత్రను ప్రస్తావిస్తున్నారు.

23 నుంచి 58 ఏళ్ల వయసులోని ఆరోగ్యవంతులైన అభ్యర్ధులపై ఈ పరిశోధన నిర్వహించారు. ఒక్కొక్కరిని రోజూ 330 మిల్లీ లీటర్ల బీరు తాగాలని సూచించారు. ‘‘బీరు తీసుకోవడం వల్ల పేగుల్లో బ్యాక్టీరియా వైవిధ్యం పెరుగుతోంది. అది కూడా బరువు, కొవ్వులు పెరగకుండానే’’ అని పరిశోధకులు చెప్పారు. అలాగే బీరు తాగడం వల్ల గుండె జబ్బుల మార్కర్లు అయిన గ్లూకోజు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను ప్రభావితం చేయడం లేదని కూడా ఈ పరిశోధన తెలుసుకుంది. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles