తెలంగాణలో కమర్షియల్ వాహనదారులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. రవాణా వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోతే పునరుద్ధరించుకునే వరకు రోజుకు రూ. 50 చొప్పున పెనాల్టీ వసూలు చేయాలన్న నిబంధనను ఉపసంహరించుకుంది. దీనివల్ల దాదాపు మూడు లక్షల వాహన యజమానులకు ఉపశమనం కలగనుంది. కొంత మంది వాహనదారులు ఫిట్ నెస్ ను పునరుద్ధరించుకోవడం లేదు. కొన్ని సంవత్సరాల నుంచి గడువు తీరిన ఫిట్‌నెస్ వాహనాలనే వినియోగిస్తున్నారు. అలాంటివారిపై రవాణా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
దాంతో, వాహనదారులు ఫిట్‌నెస్ రెన్యువల్ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వస్తున్నారు. కానీ, రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు.. గడువు తీరిన సమయం నుంచి రోజుకు రూ. 50 జరిమానా విధిస్తే ఆలస్య రుసుము వేలకు చేరుకుంటోంది. రెండు, మూడేళ్లుగా ఫిట్‌నెస్ లేని వాహనాలకు రూ. 30 వేల నుంచి 70 వేల దాకా, ఇంకా కొన్నింటికి రూ. లక్షకు పైగా పెనాల్టీ చూపిస్తోంది. అంత భారీ మొత్తంలో జరిమానా కట్టలేని వారు తమ వాహనాలను ఇండ్లకే పరిమితం చేస్తుండగా.. మరికొందరు ఫిట్‌నెస్ లేకుండానే తిప్పుతున్నారు.
అపరాధ రుసుము తొలగించాలన్న వాహనదారుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఫిట్‌నెస్ గడువు తీరిన వాహనాలపై పెనాల్టీ లేకుండా మినహాయింపు నిచ్చింది. అయితే, ఇప్పటికే కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, 2020 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ 2021 వరకు పెనాల్టీ నుంచి మినహాయింపు వెసులుబాటును కేంద్రం కల్పించింది. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం, రోజుకు రూ.50 పెనాల్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిట్‌నెస్ గడువు తీరిన వాహనాలకు రోజుకు రూ. 50 పెనాల్టీ విధిస్తే ఆర్టీఏకు రూ. 650 కోట్ల దాకా ఆదాయం సమకూరేదట.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more