Godavari in spate at Bhadrachalam, third warning issued తెలంగాణలో 14 వరకు అత్యంత భారీ వర్షాలు: ఐఎండీ హెచ్చరికలు

Godavari reaches 61ft at bhadrachalam officials to stop traffic on bridge

2 dead in wall collapse, heavy rain in telangana, IMD forecast, red alert for 14 districts, Heavry rainfall alert, Indian Meteorological Department (IMD), yellow alert, light to moderate rain, thundershowers, Hyderabad heavy rain, Telangana heavy rain, Hyderabad heavy rain update, Hyderabad rains, Hyderabad weather, hyderabad rainfall, Red alert, thunderstorm, rainfall, Badrachalam, Nizamabad, Manthani, River Godavari, massive floods,Telangana rains, Hyderabad weather today, IMD hyderabad update, Telangana, Andhra Pradesh, weather news

Massive water inflow, of around 14.6 lakh cusecs, into the Godavari took the water level past the third warning level of 53.1 feet on Wednesday. The rainwater discharge is expected to reach 18.5 lakh cusecs on Thursday morning, which will take the water level to around 63 feet, which was last breached in August 1983.

తెలుగు రాష్ట్రాలపై తగ్గని వరుణుడి జోరు.. ఉగ్రరూపం దాల్చిన గోదావరి

Posted: 07/14/2022 11:24 AM IST
Godavari reaches 61ft at bhadrachalam officials to stop traffic on bridge

తెలుగు రాష్ట్రాలలో వరుణుడి బీభత్సం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో చెరువులు, నదులు, వాగులు, వంకలు పొంగిపోర్లతున్నాయి. అయితే ఈ వరుణుడి ధాటికి తెలుగు రాష్ట్రాలలోని పలుప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్థంభించింది. పలుప్రాంతాలకు రవాణా సౌకర్యం కూడా అందకుండాపోయింది. దక్షిణ ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉండడంతో వచ్చే 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి వైపునకు వంగి ఉన్నట్టు పేర్కొన్నారు. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయని, ఎల్లుండి వరకు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం సూచించింది. రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి 12వ తేదీ మధ్య 45 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, 75 శాతం అధికంగా 78.7 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లక్షలాధి ఎకరాల్లో వరి, సోయా, కంది, మొక్కజొన్న, శనగ పంటలు నీట మునిగాయి. మంజీర నదికి వరద పోటెత్తడంతో తెలంగాణ- మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్సారెస్పీకి భారీగా ఇన్‌ ఫ్లో కొనసాగుతున్నది.  

రెంజల్‌ మండలం కందుకుర్తి వద్ద వరద పోటెత్తింది. బ్రిడ్జిపై నుంచి గోదావరి వరద ప్రవహిస్తున్నది. దీంతో మహారాష్ట్ర-నిజామాబాద్‌కు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సాలూర వద్ద మంజీరాకు పెద్దఎత్తున వరద రావడంతో పాత బ్రిడ్జి మునిగిపోయింది. దీంతో మహారాష్ట్ర-బోధన్‌ మధ్య వాహనాలు ఆగిపోయాయి. నిజామాబాద్‌-ఆర్మూర్‌ శివారులోని ధోబిఘాట్‌ వద్ద వరద భారీగా ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు జాతీయ రహదారి 63ని తాత్కాలిక మూసివేశారు. నవీపేట మండలంలోని అల్జాపూర్‌ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గోదావరి బ్యాక్‌వాటర్‌తో అల్జాపూర్‌-యంచ రోడ్డు నీటమునిగింది. దీంతో అత్యవసర సేవలు నిలిచిపోయాయి.

ఎగువన భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో ప్రాజెక్టులోని బ్యారేజీలకు రికార్డు స్థాయిలో నమోదైంది. మేడిగడ్డ బ్యారేజీలోకి 22,15,760 క్యూసెక్కుల ప్రవాహం వచ్చిచేరుతున్నది. దీంతో లక్ష్మీ బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు తెరిచి వరదనీటిని వదిలారు. ఇక అన్నారం సరస్వతీ బ్యారేజీకి 14,77,975 క్యూసెక్కుల నీరు వస్తుండగా అధికారులు అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలేస్తున్నారు.  కడెం ప్రాజెక్టుకు ముప్పుతప్పింది. వరద ఉధృతి తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎగువన భారీ వర్షాలతో ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది.

అయితే ఇన్ ఫ్లోకు తగినగట్లుగా ఔట్‌ ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టు కట్టలపైనుంచి వరద ప్రవహించింది. దీంతో ప్రాజెక్టుకు ఎప్పుడు ఏమవుతుందోనని అంతా ఆందోళన చెందారు. అయితే ప్రస్తుతానికి వరద శాంతించడంతో ప్రాజెక్టుకు ప్రమాదం తప్పింది. భారీ వరదల నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రాజెక్టు వద్ద ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని, ప్రాజెక్టును కాపాడేందుకు మానవ ప్రయత్నాలు అన్ని చేశామని అన్నారు. ఎట్టకేలకు వర్షాలు తగ్గడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదని చెప్పారు.

మొత్తం 17 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్ననామని, వరద ఉధృతిని బట్టి క్రమంగా గేట్లను దించేస్తామని పేర్కొన్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. త్రివేణి సంగమం వద్ద 15.90 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తున్నది. దీంతో మహాదేవపూర్‌, కాళేశ్వరం గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికారులు రెడ్‌అలర్ట్‌ ప్రకటించారు. పుష్కరఘాట్లను ముంచెత్తిన వరద నీరు సమీపంలోని ఇళ్లలోకి చేరింది. ముంపు ప్రాంతాల్లో నివాసాలను అధికారులు ఖాళీ చేయించారు. కాళేశ్వరం ఘాట్‌ వద్దకు ఎవరూ రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles