Man narrowly escapes death as tree falls on him చెట్టు కూలింది.. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై పడింది.. అయినా...

Man narrowly escapes death as tree falls on him in kerala s wayanad

Man narrow escape, Man narrowly escaped death, Man miraculous escape, Man narrow escape as tree falls on him, Kerala man, Kunjumon, Gulmohar tree, umbrella, tree falling, narrow escape, Wayanad, Kerala, Viral video, Video Viral

A man in Kerala’s Wayanad, identified as Kunjumon, narrowly escaped death as a fully grown tree fell right on top of him. A video of the incident is being circulated on social media. Kunjumon can be seen walking with an umbrella, and he nears a Gulmohar tree on the side of the road. Just as he is about to pass the tree, it gets uprooted, and the whole tree comes crashing down on the road.

ITEMVIDEOS: చెట్టు కూలింది.. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై పడింది.. అయినా...

Posted: 07/07/2022 06:01 PM IST
Man narrowly escapes death as tree falls on him in kerala s wayanad

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నది నానుడి. దీని అర్థం మీకు తెలుసుకదూ. లయకారకుడైన శివుడు ఆదేశించకుండా ఏమీ జరగదని.. దాని అర్థం. చెట్టు కుప్పకూలి పోవాలన్నా, మనిషి తప్పించుకోవాలన్నా అంతా శివుడి ఆజ్ఞ మేరకే జరుగుతుంది. ఏ ప్రమాదం ఎఫ్పుడు ఎక్కడ ఎలా పోంచివుందో అర్థం చేసుకోవడం మనిషి తరం కాదన్నది ఇప్పటికే మనం వీక్షించిన పలు ఘటనలు నిరూపించాయి. తమిళనాడులో రెండు బైకలపై వెళ్తున్న స్నేహితులలోని ఓక బైక్ ను ఎక్కడి నుంచో విరిగిపడుతూ వచ్చిన కొండచరియ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరోకరు తీవ్రగాయాల పాలయ్యారు.

ఇక అదే తమిళనాడులో తన సోదరితో కలసి క్యాబ్ లో వెళ్తున్న బ్యాంకు మేనేజర్ చెట్టు కుప్పకూలడంతో అక్కడికక్కడే మరణించిన ఘటన కూడా చూశాం., అమె సోదరి గాయాల పాలుకాగా, క్యాబ్ డ్రైవర్ మాత్రం స్వల్పగాయాలతో తప్పించుకున్నాడు. అదే కారులో వెళ్తున్న ఒక్కోక్కరి పరిస్థితి ఒక్కలా మారింది. దీనికి కారణం కూడా శివుడాజ్ఞే. తాజాగా కేరళలోని వాయనాడ్ జిల్లాలో ఓ వ్యక్తి వెంట్రుకవాసిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఔనా.. అంటూ ఆశ్చర్యపోతున్నారా.. ఇక ఆ వీడియో చూస్తే ఇంకెంతలా విస్మయానికి గురవుతారో.

వాయనాడ్ జిల్లా పుల్ పల్లిలో.. బుధవారం రోజున చినుకులు పడుతుండగా.. గొడుగు పట్టుకుని స్థానికుడైన కుంజుమాన్ అనే వ్యక్తి అలా రోడ్డుపై వెళ్తున్నాడు. వర్షం చిన్నగా పడుతున్న క్రమంలో అంతా నిశబ్దంగా ఉంది. ఇక చలిగా ఉన్నందున టీ కోసం బయలుదేరాడో ఏంటో తెలియదు కానీ.. కుంజుమాన్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా ఆయన ఓ చెట్టు కింద నుంచి వెళ్తుండగా, ఆయనకు చెట్టు వేళ్తను పెకిలించుకుని కిందపడుతున్న శబ్దం వినిబడింది. ఓ వైపు గొడుగు.. దీంతో ఆయన చెట్టును గమనించకుండానే ముందుకు పరుగుతీశాడు. అదే సమయానికి రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్దచెట్టు వెళ్లతో సహా కూలి రోడ్డుపై పడింది.

దీంతో ముందుకు పరుగులు తీసిన కుంజుమాన్ పెద్దగా అరిచాడు. అయితే ఆయన అరుపులు విని హడిలిపోయిన స్థానిక దుకాణాదారులు, వ్యాపారులు ఒక్కసారిగా ఏం జరిగిందోనని బయటకు వచ్చి చూసేసరికి చెట్టు పడిపోయివుంది. కానీ చెట్టు అరవదు. చెట్టుపడేటపుడు గమనించిన కుంజుమాన్ వేగంగా ముందుకు పరిగెత్తి ఏకంగా చెట్టు కొమ్మలు, రెమ్మల మధ్య చిక్కకున్నాడు. అయితే భారీ చెట్ల కొమ్మలు అతడికి ఇటు, అటూ పడడంతో కేవలం చిన్న రెమ్మలు ఆకలు మాత్రమే అతడిపై పడ్డాయి. దీంతో ఆయన స్థానికుల సాయంతో బయటకు రాగలిగాడు. అయితే కుంజుమాన్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు.. మృత్యుంజయుడు అంటూ ప్రశంసించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala man  Kunjumon  Gulmohar tree  umbrella  tree falling  narrow escape  Wayanad  Kerala  Viral video  Video Viral  

Other Articles