Lalu Prasad airlifted to Delhi, admitted to AIIMS ఎయిర్ అంబులెన్స్ లో ఎయిమ్స్‌కు లాలూ ప్రసాద్

Lalu prasad yadav taken to delhi aiims by air ambulance after falling critically ill

Lalu Prasad Yadav, Lalu Prasad Yadav AIIMS, AIIMS, Lalu Prasad Yadav hospitalised, Lalu Prasad Yadav falls from stairs, PM Modi, Tejashwi Yadav, RJD, Nitish Kumar, RJD, BJP, Janata Dal (U), Paras Hospital, AIIMS, Tejashwi Yadav, Rabri Devi, Misa Barathi, Delhi, Bihar Politics

RJD president Lalu Prasad was taken to Delhi in an air ambulance, a couple of days after falling critically ill. The 74-year-old former Bihar chief minister was accompanied by a team of doctors and his eldest daughter Misa Bharti, a Rajya Sabha MP who is also an MBBS. His wife Rabri Devi and younger son Tejashwi Yadav had left a few hours earlier to oversee the arrangements in the national capital.

ఎయిర్ అంబులెన్స్ లో ఎయిమ్స్‌కు బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్

Posted: 07/07/2022 12:44 PM IST
Lalu prasad yadav taken to delhi aiims by air ambulance after falling critically ill

బీహార్ రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన బిహార్ మాజీ ముఖ్య‌మంత్రి, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య సమస్యలతో అసుపత్రిలో చికిత్స పోందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్యాధికారులు తరలించారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు భుజం విర‌గ‌డంతో బాధ ప‌డుతున్న లాలూను మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి ఎయిర్‌ అంబులెన్స్‌లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు.

లాలూ ప్ర‌సాద్ ఆదివారం తన నివాసంలో మెట్లపై నుంచి పడిపోవడంతో ఆయ‌న కుడి భుజం ఎముక విరిగింది. దాంతో, కుటుంబ సభ్యులు ఆయనను పాట్నాలోని పరాస్ ఆసుప‌త్రిలో చేర్చించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌కు తీసుకెళ్లిన‌ట్టు ఆయ‌న కుమారుడు తేజ‌స్వి యాద‌వ్ తెలిపారు. అవసరమైతే చికిత్స కోసం సింగపూర్ కు తరలిస్తామని కూడ ఆయన చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు, ఆయన పెద్ద కుమార్తె మీసా భారతి లాలూతోనే ఉన్నారు. ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ విమానంలో ఢిల్లీ చేరుకున్నారు.

కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ అరోగ్యం విషమించిందని వార్త తెలుసుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. పరాస్ అసుపత్రికి చేరుకుని లాలూ ప్రసాద్ యాదవ్ ను పరామర్శించారు. ఆయనతో మాట్లాడి వెళ్లిన నితీష్.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. లాలూను అసవరమైతే ఢిల్లీలోని ఎయిమ్స్ అసుపత్రికి కూడా తరలిస్తామని చెప్పారు. ఇక లాలూ చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భ‌రిస్తుంద‌ని చెప్పారు. కాగా మెరుగైన చికిత్స కోసం ఆయనను ఎయిర్ అంబులెన్స్ లో ఎయిమ్స్ అసుపత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalu Prasad Yadav  Bihar  RJD  BJP  Janata Dal (U)  Paras Hospital  AIIMS  Tejashwi Yadav  Rabri Devi  Delhi  Bihar Politics  

Other Articles