Tourists missing as rains wreak havoc in Himachal Pradesh మహారాష్ట్రకు ఐఎండీ రెడ్ అల్టెర్ట్.. ఒడిశా, తెలంగాణకు భారీ వర్ష సూచన

Heavy rains trigger flash floods landslides in himachal pradesh cloudburst over kullu

Rain, Cloud Burst, Rain wreak havoc, Tourists missing, Landslide, Dhalli, Shimla, village Chojh, Flash floods, Malana project, Kullu district, himachal pradesh cloudburst, kullu district, parvati river valley bridge damage, imd, heavy rain, flash flood, landslide, deaths missing, search and rescue, Himachal Pradesh

One person was killed and a few are feared missing as rains wreak havoc in Himachal Pradesh. In a landslide incident at Dhalli in Shimla, a stone fell on a vehicle in which a fourteen-year girl was killed and two persons including a woman were seriously injured. According to HP State Emergency Operations Centre, a cloudburst in village Chojh in Kullu district occurred at 6.05 am and four to six persons and five cows are feared to have been washed away.

మహారాష్ట్రకు ఐఎండీ రెడ్ అల్టెర్ట్.. ఒడిశా, తెలంగాణకు భారీ వర్ష సూచన

Posted: 07/07/2022 11:31 AM IST
Heavy rains trigger flash floods landslides in himachal pradesh cloudburst over kullu

దేశంలోని అసోం, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో వరణుడు ఇప్పటికే బీభత్సం సృష్టిస్తున్నాడు. ఇక మరికొన్ని రాష్ట్రాల్లోనూ కుంభ‌వృష్టి కురిపిస్తున్నాడు. దేశంలోని అన్నదాతలు వానమ్మ, వానమ్మ అంటూ ఎదురుచూడాల్సిన పనిలేకుండా పిలవకుండానే వచ్చిన అతిధిలా తన పని తాను చేసుకుంటున్నాడు. అసోంలో బీభత్సం సృష్టించి.. వరదలు, కొండచరియల విరిగిపడేట్లు చేసిన వరుణుడు.. హిమాచల్ లోనూ అకస్మిక వరదలకు కారణమయ్యాడు. కులు జిల్లాలోని ప‌ర్వ‌తి లోయ‌లో ఉన్న చోజ్ ముల్లా వ‌ద్ద అక‌స్మాత్తుగా క్లౌడ్‌బ‌స్ట్ కావడంతో న‌లుగురు గ‌ల్లంతు అయ్యారు. స్థానిక గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఇదిలాఉండగానే భారత వాతావరణ శాఖ అధికారులు మరో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మహారాష్ట్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. పూణె, సతారా, కొల్హాపూర్ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అలాగే, కొల్హాపూర్‌లోని పంచగంగనది పొంగిపొర్లుతోంది. నీటిమట్టం హెచ్చరిక మార్కుకు ఏడు అడుగుల వరకు చేరుకోవడంతో ప్రజలు భయపడుతున్నారు. వర్షాలు ఇలాగే పడితే నేడే అది వార్నింగ్ మార్క్ అయిన 39 అడుగులకు చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.  

రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) 17 బృందాలను ముంబై, థానే తదితర ప్రాంతాల్లో మోహరించారు. అలాగే, సతారా జిల్లాలోని ప్రతాప్‌గఢ్ కోట సమీపంలో కొండచరియలు కూడా విరిగిపడినట్టు తెలుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ముంబైలో గత నాలుగు రోజులుగా వ‌ర్షాలు ముంచెత్తడంతో ఇప్పటికే జ‌న‌జీవనం స్తంభించిపోయింది. శివారు ప్రాంతాలన్నీ జ‌ల‌మ‌యమయ్యాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్ప‌డుతున్నాయి.

మహారాష్ట్రలోని రాయిగ‌డ్‌, ర‌త్న‌గిరి జిల్లాల‌కు రెడ్‌, ఆరెంజ్ హెచ్చ‌రిక‌ల‌ను జారీ చేశారు. త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఏక్‌నాథ్ షిండే ప్ర‌భుత్వ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ముంబై న‌గ‌రంలోని కొన్ని రూట్ల‌లో రైలు, బ‌స్సు స‌ర్వీసుల‌పై ప్ర‌భావం ప‌డింది. లోత‌ట్టు ప్రాంతాలు, రైల్వే ట్రాక్‌లు మునిగిపోవ‌డంతో ట్రాఫిక్ నిలిచిపోతోంది. అటు ఒడిశా ప్రభుత్వాన్ని కూడా ఐఎండీ హెచ్చరించింది. వచ్చే ఐదు రోజుల్లో ఒడిశాలోని 17 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. గంజాం జిల్లాలో గత 24 గంటల్లో అత్యధికంగా 130.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, తెలంగాణలోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూలు, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles