Punjab CM Bhagwant Mann ties the knot with Gurpreet Kaur నిరాడంబరంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్-గుర్ ప్రీత్ ల వివాహం

Bhagwant mann s wedding live updates punjab cm ties knot with gurpreet kaur

bhagwant mann, gurpreet kaur, bhagwant man and gurpreet kaur, bhagwant mann wedding, about bhagwant mann second wife, who is gurpreet kaur, bhagwant mann first marriage, bhagwant mann children, bhagwant mann age, gurpreet kaur age, bhagwant mann wife, punjab CM marriage, AAP, Raghav Chadha, Arvind Kejriwal, Bhagwant Mann ties knot Gurpreet, Bhagwant Mann, Gurpreet Kaur, Punjab

Punjab Chief Minister Bhagwant Mann on Thursday tied the nuptial knot with Dr Gurpreet Kaur for the second time in the presence of close family and friends. This is Mann's second marriage, as he separated from his first wife in 2015. He has two children from his first marriage.

నిరాడంబరంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్-గుర్ ప్రీత్ కౌర్ ల వివాహం

Posted: 07/07/2022 01:34 PM IST
Bhagwant mann s wedding live updates punjab cm ties knot with gurpreet kaur

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రెండో వివాహం నిరాడంబరంగా జరిగింది. ఆయన తన కన్నా 16 ఏళ్ల తక్కువ వయస్సున్న యువతిని పెళ్లి చేసుకున్నారు. హర్యానాకు చెందిన 32 ఏళ్ల గుర్ ప్రీత్ కౌర్ తో ఆయన వివాహం ఇవాళ అతిరథమహారధుల మధ్య నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లికి చండీగఢ్ లోని భగవంత్ మాన్ నివాసం వేదికగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ జిల్లా, సునామ్ నియోజకవర్గ పరిధిలోని సటోజ్ గ్రామంలో కళ్యాణ వేదిక సిద్దమైంది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం సిక్కు సంప్రదాయాల ప్రకారం జరిగింది.

ఈ పెళ్లికి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఇక ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా కూడా హాజరయ్యారు. అయితే, ఈ పెళ్లికి ఏ ఒక్క పంజాబ్ మంత్రిని, ప్రముఖ నేతలను పిలవలేదని తెలుస్తోంది. అందుకే పెళ్లిలో ఎలాంటి రాజకీయ సందడి కనిపించలేదు. అయితే ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్ధా మాత్రం పెళ్లిలో తనదైన హడావిడి చేశారు. అందుకనే ఆయన సీఎంతో కలసి పెళ్లికి ముందు ఫోటోలు దిగారు. వాటిని తన సోషల్ మీడియా అకౌంట్లలోనూ పోస్టు చేశారు.

భగవంత్ మాన్ వయసు 48 ఏళ్లు కాగా, ఆయన కంటే గుర్ ప్రీత్ 32 ఏళ్లు.. భర్త కన్నా అమె ఏకంగా 16 ఏళ్లు చిన్నది. 2015లో భగవంత్ మాన్ మొదటి భార్య ఇందర్ ప్రీత్ కౌర్ కు విడాకులు ఇచ్చారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఇందర్ ప్రీత్ కౌర్ తన పిల్లలు సీరత్ కౌర్ మాన్ (21), దిల్షాన్ మాన్ (17)లతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. ఇక డాక్టర్ గుర్ ప్రీత్ తో సీఎం భగవంత్ మాన్ కు చాన్నాళ్లుగా పరిచయం ఉంది. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం కూడా ఉంది. గత ఎన్నికల సమయంలోనూ మాన్ కు ఆమె ఎంతగానో సహకారం అందించారు. మొహాలీలో ఆమె వైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles