Hotels, restaurants barred from levying service charge హోట‌ళ్లు, రెస్టారెంట్లలో సర్వీసు చార్జీలకు చెక్.. వ‌సూలుపై నిషేధం

Restaurants explore ways to challenge service charge guidelines may take legal route

service charge, service charge in india, is service charge mandatory in india 2022, service charge restaurant, service charge vs tip, service charge law, discretionary service charge, service charge meaning, restaurant service charge india, hotels, restaurants, service in hotels, service in eateries, gurbaxish singh kohli, federation of hotel and restaurant associations, consumer protection act

The hospitality sector is actively considering challenging the Central Consumer Protection Authority (CCPA) decision barring hotels and restaurants from levying service charges automatically or by default on food bills. National Restaurants Association of India, or NRAI, is weighing the legal options to challenge the new service charge guidelines, a trustee at the industry body Said.

హోట‌ళ్లు, రెస్టారెంట్లలో సర్వీసు చార్జీలకు చెక్.. వ‌సూలుపై నిషేధం

Posted: 07/05/2022 08:59 PM IST
Restaurants explore ways to challenge service charge guidelines may take legal route

నిత్యావసర సరుకులు ఓ వైపు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు గ్యాస్ ధరలు కూడా అంతకంతకూ అందకుండా పోతున్నాయి.. దేశంలో మధ్యతరగతి వారు రెండు పూటలా తినాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక కాసింత ఉన్నత మధ్యతరగతి కుటుంబాల్లో వారాంతంలోనో, లేక మాసంలో ఒకసారి కుటుంబంతో క‌లిసి స‌ర‌దాగా రెస్టారెంట్‌కు వెళితే పెరిగిన ధ‌ర‌ల‌తో జేబు గుల్ల కావ‌డం గ్యారంటీ. ఓ వైపు బిల్లు రాగానే మనకు వడ్డించిన వస్తువులు ఏన్ని దేనికెంత ధర వేశారో చూసుకున్న తరువాత.. జీఎస్టీ ఎంత వేశారు.. స‌ర్వీసు చార్జీల పేరుతో ఎంత అద‌న‌ంగా వడ్డించారు అన్నది తప్పక చూసుకోవాల్సి వస్తుంది.

ఈ సర్వీసు చార్జీల నేపథ్యంలోనే చాలావరకు ఇళ్లలోనే కూర్చోని స్విగ్గీ, జోమాటో సర్వీసులను వినియోగించుకున్నారు సగటు మధ్య తరగతివాసులు. అంతలా సర్వీసు చార్జీలు బాదుడు వినియోగ‌దారుల‌ను కుంగ‌దీస్తోంది. వినియోగ‌దారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్త‌డంతో హోట‌ళ్లు, రెస్టారెంట్లు స‌ర్వీస్ చార్జీని వ‌సూలు చేయ‌రాద‌ని వినియోగ‌దారుల వ్యవ‌హారాల శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ కన్జూమ‌ర్ ప్రొటెక్ష‌న్ అథారిటీ (సీసీపీఏ) ఆదేశించింది. ఫుడ్ బిల్లుల‌పై ఆటోమేటిక్‌గా లేదా డిఫాల్ట్‌గా స‌ర్వీసు చార్జీల‌ను వ‌సూలు చేయవ‌ద్ద‌ని హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌కు స్ప‌ష్టం చేసింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఉల్లంఘించిన హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌పై వినియోగ‌దారులు ఫిర్యాదు చేయ‌వచ్చ‌ని సీసీపీఏ పేర్కొంది.

ఎలాంటి ఇత‌ర పేర్ల‌తో స‌ర్వీసు చార్జీని వ‌సూలు చేయ‌రాద‌ని తేల్చిచెప్పింది. స‌ర్వీస్ చార్జి చెల్లించాల‌ని ఏ హోట‌ల్‌, రెస్టారెంట్ వినియోగ‌దారుల‌పై ఒత్తిడి తీసుకురాకూడ‌ద‌ని ఆదేశించింది. వినియోగ‌దారుడు స్వ‌చ్ఛందంగా స‌ర్వీస్ చార్జీ చెల్లించ‌వ‌చ్చ‌ని దీనిపై ఎలాంటి బ‌ల‌వంతం ఉండ‌ద‌ని వినియోగదారుల‌కు హోట‌ళ్లు, రెస్టారెంట్ల యాజ‌మాన్యాలు తెలియ‌చేయాల‌ని కోరింది. ఈ మేరకు ఇదివరకే దేశ న్యాయస్థానాలు తీర్పును వెలువరిచాయని పేర్కోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ మేరకు గతంలో అదేశాలసు జారీ చేసిన విషయాన్ని సెంట్ర‌ల్ కన్జూమ‌ర్ ప్రొటెక్ష‌న్ అథారిటీ గుర్తుచేసింది.

ఫుడ్ బిల్లుతో పాటు స‌ర్వీస్ చార్జిని క‌లిపి మొత్తం బిల్లుపై జీఎస్టీ విధించ‌డం అనుమ‌తించ‌బోమ‌ని తెలిపింది. స‌ర్వీస్ చార్జిని బిల్లులో క‌లిపి ఆ మొత్తంపై జీఎస్టీ విధిస్తే స‌ర్వీస్ చార్జిని తొల‌గించాల‌ని వినియోగ‌దారులు ఆయా హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌ను కోర‌వ‌చ్చ‌ని పేర్కొంది. స‌మ‌స్య ప‌రిష్కారం కాకుంటే వినియోగ‌దారులు 1915 నెంబ‌ర్‌పై నేష‌న‌ల్ క‌న్జూమ‌ర్ అథారిటీకి ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది. ఎన్‌సీహెచ్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని పేర్కొంది. ఇక అలాగని తినే ఆహార పదార్థాలపై హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు ధరలను పెంచితాయన్న అనుమానాలను కూడా వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles