డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండ్ ధర మరోసారి పెరిగింది. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలపై పగబట్టిందా.? అన్నట్లుగా నిత్యావసర సరుకులు మొదలుకుని.. అన్ని సరుకులు ధరలు పెరుగుతున్నాయి. కరోనా ముందు పరిస్థితులు వేరు.. కరోనా తరువాత పరిస్థితులు మరింతగా దిగజారాయి. కరోనా పేరుతో ఆర్థిక పరిస్థితులంటూ కేంద్రం అన్నింటి ధరలను పెంచుకుంటూపోవడంతో మధ్యతరగతి ప్రజల స్థితిగతులు మరింతగా దిగజార్చాయి. అధికారంలోకి వచ్చేముందు నిత్యావసర సరుకుల ధరలను 100 రోజుల్లో నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వానికి కనీసం ఆ మాట గుర్తుందా.? అని కూడా ప్రశ్నలు మద్యతరగతి వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
ఓ వైపు ఇంధనం, మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్న కేంద్రం.. మధ్యతరగతికి లభించే ఆదాయాలపై శ్రద్ద చూపడం లేదన్న వాదనలు వినబడుతున్నాయి. ఇప్పటికే వంటింటి గ్యాస్ సిలిండర్ పై ఇచ్చే సబ్సీడీని కరోనా నుంచి నిలిపేసిన కేంద్రం.. ఇక ఆ తరువాత ఇటీవల కాలం నుంచి వంటింటి గ్యాస్ సిలిండర్ పై పలుమార్లు వడ్డింపులు వేస్తూనే ఉంది. అన్నింటిలోనూ 2014తో పోల్చుకునే మోడీ సర్కార్.. 2014లో వంటింటి గ్యాస్ సిలిండర్ ధర ఎంత.? సబ్సీడీ ఎంతమేర ఇచ్చేవారన్నది విషయాన్ని మాత్రం ఎందుకు మర్చిపోతున్నారు? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.
ఇక తాజాగా వంటింటి సబ్సీడి గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం మళ్లీ వడ్డించి.. మధ్యతరగతివాసుల నడ్డి విరిచింది. ఇన్నాళ్లు గృహావసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1105కు చేరింది. ఢిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్ ధర రూ.1053కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. అదేవిధంగా ఐదు కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.18 పెరిగింది. అయితే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను కేంద్రం మళ్లీ తగ్గించింది. తాజాగా సిలిండర్‌పై రూ.8.50 కోతవిధించింది.
ఈనెల 1న వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.198 తగ్గించిన విషయం తెలిసిందే. గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మంచి రోజులు వచ్చేశాయ్.. అందరికి శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్ లిండర్ ధరను కేంద్రం మరో రూ.50 పెంచేసింది. సిలిండర్ ధర పెంచి మహిళలకు ప్రధాని మోదీ కానుకగా ఇచ్చేశారు’ అని ట్విట్టర్ వేదికగా స్పందించారు. గృహావసరాల కోసం వినియోగించే 14 కేజీల సిలిండర్‌పై కేంద్రం రూ.50 వడ్డించింది. దీంతో హైదరాబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1105కు చేరింది.
#AchheDin Aa Gaye
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more