Amid Face-Off With Centre, Twitter Goes To Court భారత ప్రభుత్వంపై ట్విట్టర్ కేసు.. అధికార దుర్వినియోగం అంటూ ఆరోపణలు!

Twitter goes to court against centre over content takedown orders

Government of India, Karnataka High Court, Twitter, IT Rules, Twitter IT Rules, PIL on Twitter, MeitY, minister of state for IT and electronics, Rajeev Chandrasekhar, India, Social Media, Microblogging platform

Microblogging platform Twitter has moved the Karnataka high court challenging the IT Rules, 2021, after it was directed by the government to take down some tweets by July 4. While Twitter refused to comment on the matter, sources in the government said that the firm had approached the HC, after complying with the directions on the takedown. Legal observers interpreted the move as challenging the legality of the IT Rules, which is seen by the company as violative of the fundamental rights.

భారత ప్రభుత్వంపై ట్విట్టర్ కేసు.. అధికార దుర్వినియోగం అంటూ ఆరోపణలు!

Posted: 07/05/2022 07:51 PM IST
Twitter goes to court against centre over content takedown orders

ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తోంది. భారత ప్రభుత్వం జారీ చేసిన అదేశాలకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో ఆర్జి దాఖలు చేసింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. గతేడాది నుంచి రకరకాల పోస్టులు తొలగించాలంటూ భారత ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా సంస్థలకు ఉత్తర్వులు అందాయి. ప్రభుత్వ చర్యలపై దుష్ప్రచారం చేస్తున్న పోస్టులను తొలగించాలని కొత్త ఐటీ రూల్స్ చెప్తున్నాయి.

అయితే వీటిలో కొన్ని రిక్వెస్ట్‌లు సమంజసంగా లేవని ట్విట్టర్ తన పిటీషన్ లో పేర్కోంది. తమ భారత ఖాతాదారుల భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రభుత్వ అదేశాలు భంగం కలిగించేలా ఉన్నాయని ట్విట్టర్ కేసు వేసింది. కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధికారిక ఖాతాలు పెట్టిన పోస్టులను తొలగించాలని తమకు ఆదేశాలు వచ్చాయని, కానీ అలా చేయడం అంటే భావ ప్రకటనా స్వేచ్ఛను తుంగలో తొక్కేయడమేనని ఈ సోషల్ మీడియా సంస్థ వాదిస్తోంది. దేశ భద్రతకు, హింసను ప్రేరేపించే పోస్టులను తామ సిబ్బంది తొలగిస్తున్నారని ట్విట్టర్ సంస్థ పేర్కోంది.

కాగా, ఇతర పార్టీ నేతలు, పెట్టిన పోస్టులతో పాటు ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పెట్టిన పోస్టులను కూడా తొలిగించాలని భారత ప్రభుత్వం కోరుతోందని.. ఇది వారి అభిప్రాయాల భావవ్యక్తీకరణ హక్కుకు విఘాతం కల్పించమే కదా అని పేర్కోంది. అయితే కొత్త ఐటీ రూల్స్ ప్రకారం, దేశ భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని రకాల కంటెంట్‌ ప్రజలకు అందుబాటులో లేకుండా బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాము చెప్పిన కంటెంట్‌ను తొలగించకపోతే క్రిమినల్ కేసులు పెడతామని భారత ఐటీ శాఖ అధికారులు చెప్తున్నారని, ఇది అధికార దుర్వినియోగమని ట్విట్టర్ ఆరోపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles