Udaipur Tailor Murder A Terror Attack ఉదయ్ పూర్ హత్యలో ఉగ్రకోణం.. నిందితులకు పాక్ తో 'లింక్స్​.!

Udaipur murder updates anti terror agency nia takes over probe

udaipur, udaipur murder, udaipur hindu shopkeeper killed, udaipur news, udaipur murder news, ashok gehlot, udaipur tailor, udaipur tailor video, udaipur tailors killed, udaipur taylor killing, udaipur tailor death, Udaipur, Tailor, HIndu, Islamic Radical Group, facebook post, Nupur sharma, Narendra Modi, Ashok Gehlot, Rajasthan, Crime

The murder of a tailor yesterday sparked tension in Udaipur, Rajasthan. The killers - Gos Mohammad and Riyaz - entered Kanhaiya Lal's shop at a crowded market in the city and slit his throat with a cleaver, and even filmed the incident. The attackers have been arrested. The murder is being treated as a terror incident, sources in the government said.

ఉదయ్ పూర్ హత్య వెనుక ఉగ్రకోణం.. నిందితులకు పాక్​ ఉగ్రసంస్థతో 'లింక్స్​.!

Posted: 06/29/2022 02:43 PM IST
Udaipur murder updates anti terror agency nia takes over probe

రాజస్థాన్​ ఉదయ్​పూర్​లో హిందూ టైలర్​ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్​ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన దుకాణంలోకి చోరబడిని ఇద్దరు ముష్కరులు ఆయనను అత్యంత దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. అయితే దర్జీ కన్నయ్య లాల్ మొండం నుంచి తలను వేరు చేసేంత దారుణానికి వారు ఒడిగట్టారు. ఈ విషయం తెలిసిన నేపథ్యంలో ఇది దేశ, అంతర్జాతీయ ఉగ్ర సంస్థల ప్రమేయం ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ అనుమానాలు వ్యక్తం చేశారు.

దీంతో ఉగ్రకోణంలో ఈ హత్యకేసును నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తమను తాము ఇస్లామిక్ రాడికల్ గ్రూపుకు చెందిన వ్యక్తులుగా ప్రకటించుకున్న ఇద్దరు ఉగ్రవాదులకు పాకిస్థాన్​ ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. నిందితులు గౌస్​ మహమ్మద్​, రియాజ్​ అహ్మెద్​లు.. కరాచీ ఆధారిత సున్ని ఇస్లామిస్ట్​ సంస్థ దావత్​ ఈ ఇస్లామికు పరిచయస్తులని సమాచారం. దావత్​ ఈ ఇస్లామికి పాకిస్థాన్​లోని ఉగ్రవాద సంస్థ తెహ్రీక్​ ఈ లబ్బైక్​తో సంబంధం ఉందని.. ఉదయ్​పూర్​ హత్య ఘటన దర్యాప్తులో ఉన్న కొందరు చెబుతున్నారు.

మహమ్మద్​ ప్రవక్తపై బీజేపీ మాజీ నేత నుపుర్​ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా అలజడులు సృష్టించాయి. నుపుర్​ వ్యాఖ్యలను ముస్లిం దేశాలు తీవ్రంగా ఖండించాయి. దేశంలోనూ నిరసనలు చెలరేగాయి.ఈ క్రమంలోనే నుపుర్​ శర్మకు మద్దతుగా.. ఉదయ్​పూర్​లోని టైలర్​ కన్నయ్య లాల్​.. సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్​ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ.. మంగళవారం అతడి దుకాణంపై దాడి చేశారు రియాజ్​, గౌస్​. కత్తులతో అతడిని చంపేశారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మను కూడా చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని నిమిషాల్లోనే ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఉదయ్​పూర్​లో మతఘర్షణలు చెలరేగాయి. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉదయ్​పూర్​లో కఠిన ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్​ సేవలను రద్దు చేశారు. ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Udaipur  Tailor  HIndu  Islamic Radical Group  facebook post  Nupur sharma  Narendra Modi  Ashok Gehlot  Rajasthan  Crime  

Other Articles