మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని అధికార మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. అసెంబ్లీలో ఠాక్రే సర్కారు తమ మెజార్టీని నిరూపించుకోవాలని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశించారు. ఇందుకోసం రేపు(జూన్ 30) ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించారు.
రాష్ట్రంలోని మహా వికాస్ అఘాడి సర్కారుకు తగు సంఖ్యాబలం లేదని నిన్న రాత్రి... బీజేపి ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ నేతృత్వంలోని బీజేపి ఎమ్మెల్యేలు గవర్నర్ కలసి.. శివసేనకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారని, సర్కారు మైనారిటీలో పడిందని ఆయనకు వినతపత్రాన్ని సమర్పించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్.. బలాన్ని నిరూపించుకోవాలని ఠాక్రే సర్కారును ఆదేశించారు. ఈ మేరకు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత గవర్నర్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
గురువారం ఉదయం 11 గంటలకు ఈ విశ్వాస పరీక్ష జరిపించాలని.. ఈ మొత్తం ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం 5 గంటల్లోగా పూర్తిచేయాలని గవర్నర్ సూచించారు. దీన్ని రికార్డ్ చేయాలని ఆదేశించారు. కాగా, ఇదివరకే శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై వేసిన వేటును దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. జూలై 11 వరకు వారిపై వేటు వేసేందుకు అవకాశం లేదని చెప్పిన నేపథ్యంలో.. ఆ ఉత్తర్వులతో పాటు గవర్నర్ అదేశాలపై శివసేన దేశఅత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇదిలా ఉండగా, శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ గవర్నర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గత రెండు సంవత్సరాలుగా తమ ప్రభుత్వం పంపిన ఫైల్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని.. అయితే వాటిపై ఇప్పటివరకు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. కానీ ప్రస్తుత పరిణామాలపై ఆయన జెట్ వేగంతో దూసుకెళ్తున్నారని విమర్శలు చేశారు. రఫేల్ జెట్ కూడా ఇంత వేగంగా ఉండదు. అంతకన్నా వేగంగా గవర్నర్ పనిచేస్తున్నారని.. భారత రాజ్యాంగంతో గవర్నర్ ఆటలాడుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఆదేశాలు చట్టవిరుద్ధం. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఇంకా తీర్పు వెలువరించని తరుణంలో తాజా చర్య చట్టవిరుద్ధం’ అంటూ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more