From BP to sugar, medicines get expensive by up to 30% రోగులపై గుదిబండ.. భారీగా పెరగిన ఔషధాల ధరలు..

After traders now manufacturers raise prices medicines get expensive by up to 30

Manufacturers, Pramod Kalani, Drug Manufacturing Association, essential medicines, prices, Traders, essential medicines, prices of essential medicines, antibiotics, anti-inflammatory drugs, ear-nose medicines, painkillers, Uttarakhand, paracetamol, medicine prices, inflation

As the Indian rupee has continued to plunge against the dollar amid weakness in domestic shares, this has led to a sharp rise in the cost of medicine in the country. According to a report, the prices of medicines have increased by 30% in Uttarakhand. Most of the new batches of medicines available at medical stores are coming with inflated prices in the hilly state, the daily noted.

రోగులపై గుదిబండ.. భారీగా పెరగిన ఔషధాల ధరలు.. పారాసిటమాల్​ సహా అన్నింటిపై..

Posted: 06/29/2022 03:55 PM IST
After traders now manufacturers raise prices medicines get expensive by up to 30

అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా దేశంలోని అన్ని వస్తువుల ధరలు పెరగడంతో పాటు ఔషధాల ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్​లో ఈ పరిస్థితులు ఇప్పటికే ఆందోళనకరంగా ఉన్నాయి. ఉత్తరాఖండ్​లో ఔషధాల ధరలు 30శాతం మేర పెరిగాయి. ఈ రేట్లు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెరిగిన ధరలు ఇప్పటికే మార్కెట్లో అమల్లోకి వచ్చేశాయి.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔషధాల తయారీకి కావాల్సిన ముడిసరకుధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఔషధ తయారీదారుల అసోసియేషన్​ హెడ్​ ప్రమోద్​ కలాని అన్నారు. అదే సమయంలో రూపాయి విలువ బలహీనపడుతోందని గుర్తుచేశారు. ఫలితంగా ఆ ప్రభావం ప్రజలపై పడుతోందని, ఔషధాల ధరలు పెరుగుతున్నాయని అన్నారు. జ్వరం కోసం వినియోగించే పారాసిటమాల్​కు సంబంధించిన ముడిసరకు ధర గతంలో రూ. 5వేల/కేజీగా ఉంటే.. ఇప్పుడది కేజీకి రూ. 9వేలకు చేరింది. అందువల్ల ధరలు 10శాతం- 30శాతం మేర పెరిగాయని తెలిపారు.

మరోవైపు చమురు ధరలు, ద్రవ్యోల్బణం, అనిశ్చితి కారణాలతో ఔషధాల తయారీ సంస్థలు.. ధరల పెంపునకు మొగ్గుచూపుతున్నట్టు ఉత్తరాఖండ్​ స్టేట్​ డ్రగ్​ కంట్రోల్​ తజ్​బార్​ జగ్గి పేర్కొన్నారు. జ్వరం ట్యాబ్లెట్లతో పాటు బీపీ, షుగర్​ మందులు కూడా ఉత్తరాఖండ్​లో పెరిగిపోయాయి. షుగర్​ ఇంజెక్షన్​ (రైజోడెగ్​).. గతంలో రూ. 1024గా ఉండగా ఇప్పుడది రూ. 1126కు చేరింది. షుగర్​ మెడిసిన్​ గ్లైకోమెట్​.. గతంలో రూ. 155 నుంచి ప్రస్తుతం రూ. 170కి పెరిగింది. లివిర్​ మెడిసిన్​ ఉడిలివ్​.. రూ. 580 నుంచి రూ.694కు వెళ్లింది. ద్రవ్యల్బణం దిగిరాకపోతే.. దేశవ్యాప్తంగా ఔషధాల ధరలు పెరుగుతాయని మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles