Amid Chances of Heavy Rainfall, GHMC alerts Hyderabadis నగరవాసులకు జీహెచ్ఎంసీ భారీ వర్షం అలర్ట్..

Ghmc issues high alert to hyderabadis says chances of heavy rainfall in city

Hyderabad Heavy rainfall forecast, GHMC alerts Hyderabadis, Heavy rainfall in GHMC, Hyderabadis be at homes warns GHMC, Heavy rainfall at night, Hyderabad, heavy rainfall, GHMC, alert to citizens, GHMC warns citizens, Heavy rainfall alert, stay at home, Hyderabad, Rainfall, weather update

The GHMC has forecast heavy rains in the city on Tuesday night. Warns people not to leave their homes unless necessary. To this extent GHMC has kept DRF teams on alert at the field level. Many parts of Hyderabad were inundated with moderate rains since this afternoon.

నగరవాసులకు జీహెచ్ఎంసీ భారీ వర్షం అలర్ట్.. అవసరమైతే బయటకు రావొద్దు..

Posted: 06/28/2022 06:58 PM IST
Ghmc issues high alert to hyderabadis says chances of heavy rainfall in city

హైదరాబాద్‌ నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ హెచ్చరికలు జారీ చేసింది. నగరవాసులు అవసరం అయితే తప్ప తమ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ రాత్రి నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. సోమవారం నుంచి నగరవాప్తంగా ముసురు పడుతున్న నేపథ్యంలో ఇవాళ రాత్రి మాత్రం విస్తారంగా వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి అనవసరమైన ఇబ్బందుల పడోద్దని హెచ్చరించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో డీఆర్‌ఎఫ్‌ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తంగా ఉంచింది.

ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. సికింద్రాబాద్, అల్వాల్‌, నెరేడ్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. మరో వైపు రాష్ట్రంలో అక్కడక్కడ ఈరోజు రేపు భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు పడమర ద్రోణి ఉత్తర మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ..దక్షిణ ఒడిశా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టానికి సుమారు 900మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles