TTD plans to tighten Security in Tirumala తిరుమలలో ఆత్యాధునిక భద్రతకు టీటీడీ ప్రణాళిక

Ttd planning an armory for tightening security in tirumala

Tirumala Srivari security arrangements, Tirumala security will be further tightened, TTD planning armory, modern technology security at Tirumala, TTD radical changes in Security, ttd security, new initiatives, scale up security, increase in piligrims, Temple city, Tirupati, Andhra Pradesh, Devotional, Crime

In addition to the security of Tirumala Srivari, security arrangements will be further tightened in Tirumala to prevent any accidents to the devotees. TTD is planning an armory for this. TTD hopes to use modern technology for the security of Srivastava as the number of devotees coming to Thirumala continues to grow and dangers lurk from various forces. As part of this, TTD is preparing to make radical changes in security matters.

తిరుమలలో ఆత్యాధునిక భద్రతకు టీటీడీ ప్రణాళిక

Posted: 06/28/2022 06:10 PM IST
Ttd planning an armory for tightening security in tirumala

తిరుమల శ్రీవారి భద్రతకు అత్యాధిునికంగా తీర్చిదిద్దాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తిరుమలకు కరోనా మహమ్మారి తరువాత భక్తుల రద్దీ పెరుగుతున్న తరుణంలో అటు భక్తులతో పాటు శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు భద్రత కల్పించడంతో పాటు ఆలయ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఇందుకోసం టీటీడీ పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ మారుతున్న సాంకేతికత నేపథ్యంలో అత్యంతాధునిక సాంకేతికతతో కూడిన భద్రతను కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

శ్రీవారి దర్శనానికి భక్తుల సంఖ్య ఏటేటా పెరగడంతో పాటు రకరకాల శక్తుల నుంచి ప్రమాదాలు పొంచి ఉండటంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని శ్రీవారి భద్రతకు వాడుకోవాలని టీటీడీ భావిస్తోంది. ఇందులో భాగంగా టీటీడీ భద్రతా వ్యవహారాల్లో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. తిరుమల పుణ్యక్షేత్రంలో భద్రత కోసం అత్యాధునికి రక్షణ వ్యవస్థను సమకూర్చుకోవాలని టీటీడీ భావిస్తోంది. తిరుమలకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు యాక్సెస్‌ కంట్రోల్‌తో పాటు ఘాట్‌ రోడ్డులో సిసిటివి ప్రాజెక్టు, తిరుమల ఆలయంతో పాటు, బూందీపోటులో నైట్రోజన్‌ లిక్విడ్‌ కార్పెట్ల ఏర్పాటు, అత్యాధునిక అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఫేజ్‌ 3లో భాగంగా సిసిటివిల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

తిరుమలలో ముఖ్యమైన ప్రదేశాల్లో స్మార్ట్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. బాంబ్ డిస్పోజల్ ఉపకరణాలను సమకూర్చుకుంటారు. స్పీడ్ రికార్డింగ్ కెమెరాలు, స్పీడ్ గన్స్‌ కొనుగోలు చేస్తారు. అలిపిరి టోల్ గేట్ వద్ద ఫాస్టాగ్‌ ఏర్పాటు చేస్తారు. ఆభరణాల రవాణాకు బుల్లెట్ ప్రూఫ్‌ వాహనాలను కొనుగోలు చేస్తారు. టీటీడీలో ప్రత్యేక భద్రత వ్యవస్థ 1974లో ప్రారంభమైంది. డిఎస్పీ స్థాయి అధికారితో తిరుమలలో భద్రత ఏర్పాట్లను ప్రారంభించారు. 1984నాటికి తిరుమలలో భద్రతా వ్యవహారాల కోసం ఐపిఎస్‌ స్థాయి అధికారితో విజిలెన్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అలిపిరిలో 2003లో జరిగిన బాంబు దాడి తర్వాత తిరుమలలో భద్రతా వ్యవస్థలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

ప్రస్తుతం తిరుమలలో భద్రతా విధుల కోసం పెద్ద ఎత్తున సివిల్ పోలీసుల్ని వినియోగిస్తున్నారు. తిరుమల కొండలపై నిరంతరం సాయుధ బలగాల పహారా కొనసాగుతుంది. దాదాపు 23వేల మంది టీటీడీ ఉద్యోగులతో పాటు నిత్యం స్వామి వారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తుల భద్రతను టీటీడీ భద్రతా విభాగం పర్యవేక్షిస్తుంది.రోజురోజుకు భక్తుల తాకిడితో పాటు విఐపిల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరిని తనిఖీ చేయడం సాధ్యమయ్యే పనికాకపోవడంతో భద్రతలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్లు టీటీడీ చీఫ్‌ విజిలెన్స్‌ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్‌ చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles