Uddhav Thackeray's Emotional Appeal To Rebels రండీ కూర్చోని మాట్లాడుకుందాం: రెబల్స్ కు ఉద్దవ్ భావోద్వేగ లేఖ

Uddhav thackeray asks sena rebel mlas to return to mumbai talk to him

Uddhav Thackeray, Shiv Sena, Eknath Shinde, Rebel MLAs, Thackeray letter, Governor, Mumbai, Maharashtra Political Crisis, Maharashtra Political Crisis Updates, Maharashtra Political Situation, Maharashtra Political Drama, Maharashtra Election, Maharashtra Politics, Maharashtra News, Maharashtra, Politics

With all eyes locked on Maharashtra amid the escalating political crisis, Maharashtra Chief Minister Uddhav Thackeray, asked the rebel MLAs to return to Mumbai and talk to him. Thackeray is scheduled to chair a Cabinet meeting at 5 pm on Tuesday. The CM's appeal comes hours after rebel leader Eknath Shinde on Tuesday morning said, "We will return to Mumbai soon. We are still in the Shiv Sena."

ముంబైలో కూర్చోని మాట్లాడుకుందాం.. రండీ: రెబల్స్ కు ఉద్దవ్ భావోద్వేగ లేఖ

Posted: 06/28/2022 04:51 PM IST
Uddhav thackeray asks sena rebel mlas to return to mumbai talk to him

మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ పరిణామాల మధ్య మహారాష్ట్రవాసులు కన్నార్పకుండా గమనిస్తున్నారు. శివసేనకు చెందిన పలువురు తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరినా.. అక్కడి నుంచి తమతో కొందరు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించగా.. అదంతా అవాస్తవమేనని తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్‌ శిందే ఖండించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎవరెవరు తమతో టచ్ లో ఉన్నారో వారి పేర్లను వెల్లడించాలని కూడా ఆయన వర్గం డిమాండ్ చేసింది.

ఈ పరిణామాల క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే గౌహతిలోని స్టార్‌ హోటల్‌లో బస చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలకు కీలక విజ్ఞప్తి చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ముంబైకి తిరిగి వచ్చి.. తనతో కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరుకుతుందని లేఖలో పేర్కొన్నారు. ‘‘మీలో చాలా మంది మాతో టచ్‌లో ఉన్నారు.. అంతేకాకుండా మీరంతా శివసేన గుండెల్లో ఉన్నారు. రండి.. మాట్లాడుకుందాం.. అప్పుడే ఒక పరిష్కారం దొరుకుతుంది’’ అన్నారు. ‘‘సమయం ఇంకా మించిపోలేదు. నాతో కూర్చొని మాట్లాడండి’’ అని విన్నవించారు.

అంతేకాదు ‘‘తాజా పరిణామాలతో శివసైనికులు, ప్రజల్లో ఏర్పడిన అనేక సందేహాలను తొలగించాలి. ఎవరి మాటలకూ లొంగిపోవద్దు. శివసేన మీకు ఇచ్చిన గౌరవం మరెక్కడా దొరకదు. మీరు వచ్చి నాతో మాట్లాడితేనే ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా మీ అందరి పట్ల నేను ఆందోళనతో ఉన్నా.. మీలోని చాలామంది కుటుంబసభ్యులు మాతో వచ్చి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.. వారికి మేము గౌరవించి పరిగణలోకి తీసుకున్నాం’’ అని ఉద్ధవ్‌ పేర్కొన్నారు. ఇదిలాఉండగా, పార్టీలోని మరో అగ్రనేత సంజయ్ రౌత్ రెబల్ ఎమ్మెల్యేలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

శివసేన వీడి ఏక్ న్నాథ్ షిండే పంచన చేరిన రెబల్ ఎమ్మెల్యేల వాదన విచిత్రంగా ఉందని ఆయన ముంబై సమీపంలోని అలిబాగ్ లో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వీరు తెరవెనుక నెరపిన రాజకీయమంతా డబ్బు మాత్రమేనని అరోపించారు. శివసేన పార్టీ హిందుత్వ భావజాలం ఉన్న బీజేపిని కాదని.. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇష్టంలేక తాము తిరుగుబాటు చేశామని చెప్పడం ఎంతవరకు సమంజసమో మీరే చెప్పాలన్నారు. షిండే వర్గంలో ఉన్న ఏకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఎన్సీపి నుంచి శివసేనలో చేరినవారేనని అన్నారు. వారు ఏ హిందుత్వ గురించి మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇక అధికార కోసం పీడిపీతో కలసి బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని వీరు మర్చిపోయారా.? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uddhav Thackeray  Shiv Sena  Eknath Shinde  Rebel MLAs  Thackeray letter  Governor  Mumbai  Maharashtra  politics  

Other Articles