ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్‌తో అనుబంధం కలిగి ఉన్నవారే. నెటిజన్లు.. ఐటీ, బిజినెస్ రంగాల్లో పని చేసేవారు తమ లావాదేవీలపై నిత్యం ఈ-మెయిల్స్‌లో సమాచార మార్పిడి చేస్తుంటారు. అందుకు ఇంట్లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఒకవేళ బయటకు వెళితే.. అక్కడ ఇంటర్నెట్ ఉండకపోవచ్చు. అత్యవసరంగా ఈ-మెయిల్ ఓపెన్ చేయాల్సి రావచ్చు. ఒక్కోసారి ఈ-మెయిల్ చెక్ చేసుకుంటే బాగుండనని అనిపించవచ్చు. అటువంటి కష్టాలకు ఇక గూగుల్ చరమ గీతం పాడనున్నది. తన జీ-మెయిల్ యూజర్లకు ఆఫ్‌లైన్‌లోనూ సేవలను వినియోగంలోకి తీసుకొచ్చింది.
అంటే ఇక ఇంటర్నెట్ లేకుండానే ఆఫ్‌లైన్‌లోనే జీ-మెయిల్‌లో మెయిల్ చదివి సమాధానం ఇవ్వవచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని మారుమూల ప్రాంతాల్లో జీ-మెయిల్ ఆఫ్‌లైన్ సేవలు వాడుకోవచ్చు. అయితే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోనే ఈ జీ-మెయిల్ ఆఫ్‌లైన్ సేవలు లభిస్తాయి. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఆఫ్ లైన్ సేవలు పొందలేరు. ఆఫ్‌లైన్‌లో జీ-మెయిల్ సేవలు ఎలా పొందాలో తెలుసుకుందామా..!ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉన్నప్పుడు క్రోమ్ బ్రౌజర్లో mail.google.com బుక్‌మార్క్ చేసుకోవాలి. తర్వాత జీమెయిల్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. సీ ఆల్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆఫ్‌లైన్ ట్యాబ్ క్లిక్ చేయాలి. అప్పుడు ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్ ఆప్షన్ సెలక్ట్ చేశాక ఆఫ్‌లైన్‌లో ఎన్ని రోజుల క్రితం ఈ-మెయిల్స్ స్టోర్ చేయాలో అడుగుతుంది. అందులో వారం, నెల, మూడు నెలల ఆప్షన్లుంటాయి. అందులో మీకు అవసరమైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అటుపై సేవ్ చేంజెస్‌పై క్లిక్ చేస్తే సరి. జీ-మెయిల్ ఆఫ్‌లైన్ సేవలు పొందొచ్చు. కొంత మంది జీమెయిల్ ఖాతాలో ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్ ఆప్షన్ స్థానే ఎండ్ స్పేస్ అనే మెసేజ్ వస్తుంది. అటువంటి వారి జీ-మెయిల్ స్టోరేజీ కెపాసిటీ నిండిపోయిందని అర్థం. అప్పుడు గూగుల్ ఖాతాలో అనవసర డేటా తొలగిస్తే ఆఫ్‌లైన్‌లో మెయిల్స్ స్టోర్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more