అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు రిమాండ్ విధించింది. సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తోన్న సుబ్బారావును సికింద్రాబాద్ అల్లర్లలో ప్రధాన సూత్రధారిగా తేల్చారు పోలీసులు. సుబ్బారావుతో పాటు అతని ముగ్గురు అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి రైల్వే కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు రైల్వే కోర్టు నుంచి సుబ్బారావుతో పాటు అతని అనుచరులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో సుబ్బారావును ప్రధాన సూత్రధారిగా రైల్వే పోలీసులు తేల్చారు. సూత్రధారితో పాటు కేసులోని నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 149 ఐపీసీ సహా 25 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వీటితో పాటుగా రైల్వే యాక్ట్ సెక్షన్ 3,4 తో పాటు మరిన్ని సెక్షన్లను నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి విధ్వంసం సృషించే విధంగా వాళ్లు ప్లాన్ చేసినట్లు పోలీసులు గర్తించారు. 16న సాయంత్రం నరసరావుపేట నుంచి హైదరాబాద్ వచ్చిన సుబ్బారావు,.. బోడుప్పల్‌లోని ఎస్వీఎం గ్రాండ్ లాడ్జిలో బస చేసినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లో చేసే విధ్వంసానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు హకీంపేట ఆర్మీ సోల్జర్స్ గ్రూపులో పోస్టు చేశారని పేర్కొన్నారు.
అభ్యర్థులను రెచ్చగొట్టి సికింద్రాబాద్ వచ్చేలా చేయాలని తన అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డికి ఆవుల సుబ్బారావు సూచించారని పోలీసులు గుర్తించారు. సాయి డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్న యువకులకు రూ.35వేలు ఇచ్చి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి సహాయ సహకారాలు అందించారని వివరించారు. సుబ్బారావు అనుచరులు శివ, మల్లారెడ్డి సికింద్రాబాద్ వచ్చి విధ్వంసంలో పాల్గొన్నారని... విధ్వంసానికి సంబంధించిన సమాచారాన్ని ఫోన్ ద్వారా సుబ్బారావుకు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అగ్నిపథ్ పథకం వల్ల డిఫెన్స్ అకాడమీలు నష్టాల పాలవుతాయనే ఉద్దేశంతోనే విధ్వంసానికి కుట్ర పన్నారని గుర్తించారు.
రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టిస్తేనే కేంద్రం అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని కుట్ర పన్నారు. విధ్వంసం తర్వాత తన పాత్ర బయటపడకుండా వాట్సప్ గ్రూపులలోని సందేశాలను డిలీట్ చేసినట్లు జీఆర్పీ ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో మరికొన్ని డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. కాగా, అగ్నిపాథ్ అల్లర్ల కేసులో ఆవుల సుబ్బారావును బలి పశువును చేశారని ఆయన తరపు న్యాయవాది అన్నారు. సుబ్బారావు దేశ భక్తి మెండుగా ఉన్న వ్యక్తి అని, అతనిపై పోలీసులు మోపిన అభియోగాలు అన్ని తప్పుడు అభియోగాలని చెప్పారు. సుబ్బారావు ఏ వాట్సప్ గ్రూప్‌లకు అడ్మిన్‌గా లేడని, ఎలాంటి హింసాత్మక మెసేజెస్, వీడియోలు ఫార్వర్డ్ చేయలేదని తెలిపారు. న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more