అపరిచితులతో అన్ లైన్ స్నేహాలు మంచికి అసలు అది మార్గమే కాదు.. ఏదో పోరబాటున తప్ప.. ఇక చెడుకు నూటికి నరుపాళ్లు అస్కారముందని అన్ లైన్ స్నేహాలు మోజులో పడి ఉన్నదంతా ఊడ్చిపెట్టేస్తున్నవారి ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అపరిచిత వ్యక్తులతో సంబంధాలను నెరపరాదని చెప్పాల్సిన బాధ్యతాయుత పదవిలో కొనసాగుతూ కూడా అడ్డంగా బుక్కయ్యాడు ఓ అధికారి. తనది కాకపోతే ఎందాకైనా అన్న నానుడి బాగా వంటపట్టించుకున్న అతగాడు.. తనది కాదు కదా అని బ్యాంకులో ఉన్న ప్రజాధనంతో ఓ బ్యాంకు కుంభకోణానికే తెరతీసాడు.
బ్యాంకు మేనేజర్ హోదాలో ఉన్న వ్యక్తి వలపు వలలో పడ్డాడు. ఆన్లైన్ డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఆ యువతి ఉచ్చులో పడి భారీ అక్రమానికి పాల్పడ్డాడు. ఓ కస్టమర్ ఖాతా నుంచి అక్రమంగా రూ.6 కోట్లు రుణం తీసి ఆ యువతి ఖాతాలో వేశాడు. బ్యాంకు అంతర్గత తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. దీనిపై ఉన్నతాధికారుల ఫిర్యాదు చేయడం వల్ల బ్యాంకు మేనేజర్ సహా అతడికి సహాయం చేసిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక బెంగళూరుకు చెందిన హరిశంకర్ ఇండియన్ బ్యాంకు హనుమంతనగర్ శాఖలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
నాలుగు నెలల కిందట ఓ డేటింగ్ యాప్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతి అతడికి పరిచయమైంది. రోజూ మెసేజ్ చేస్తూ అతడిని ఆకట్టుకుంది. ఓ రోజు డబ్బులు కావాలంటూ అడగగా.. రూ.12 లక్షలు ఆమె ఖాతాలో వేశాడు. ఆ తర్వాత మరోసారి డబ్బులు ఇవ్వాలని కోరింది. బ్యాంకులోని అనిత అనే ఖాతాదారురాలి అకౌంట్ ద్వారా రూ. 6 కోట్లు రుణాన్ని తీసి యువతి ఖాతాలో వేశాడు హరిశంకర్. అంతకుముందు అనిత తన ఖాతాలో రూ. 1.3 కోట్లు డిపాజిట్ చేసుకుంది. తాజాగా రుణం కోసం దరఖాస్తు చేసుకుని.. దానికి సంబంధించిన పత్రాలను సమర్పించింది.
అయితే, హరిశంకర్ వాటిని తారుమారు చేసి రూ.6కోట్లు రుణం మంజూరు చేశాడు. ఆ డబ్బును డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతికి ఇచ్చాడు. మే 13న అనితకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా నుంచి రుణం ఇవ్వగా.. మే 19న అంతర్గతంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. జోనల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరిశంకర్ సహా అతడికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం చేసినట్లు అంగీకరించాడు. హరిశంకర్‌ను కోర్టులో హజరుపర్చగా.. 10 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more
Aug 06 | ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అన్న పాట చాలా పాపులర్.. కానీ ప్రేమంటే ఇదేరా అన్న మాట కూడా చాలా పాపులర్. ఈ ప్రేమ అనే రోగం కుడితే.. చాలా వరకు... Read more
Aug 06 | భర్త నుంచి జీవన భృతి కోరుతూ కోర్టుకెక్కిన ముస్లిం మహిళకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ క్రమంలో గత తీర్పును కొట్టేసిన న్యాయస్థానం.. తలాక్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. షరియత్ చట్ట నిబంధలనకు... Read more
Aug 06 | తెలంగాణపై వరుణుడు ప్రతాపం చాటుతూనే ఉన్నాడు. గడిచిన రెండు నెల్లలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురియడంతో.. చెరువులు, వాగులు, వంకలు అన్ని నిండు కుండలను తలపిస్తున్నాయి. అయినా వరుణుడు శాంతించడం లేదు. ఉపరితల ఆవర్తన... Read more