Impose President's Rule in Maharashtra, says MP Navneet Rana నవనీత్ రాణా రాష్ట్రపతి పాలన డిమాండ్ వెనుక ఎవరు.?

Impose president s rule in maharashtra says mp navneet rana cites thackeray s hooliganism

Uddhav Thackeray, Navneet Rana, Lok Sabha MP, Amravati, President's Rule, Maharashtra Political Crisis, Political Crisis, Election Special, Shiv Sena, Eknath Shinde, Eknath Shinde News, Maharashtra Political Crisis Update, Uddhav Thackeray Government, Rebel MLAs, backstabbed politics, Uddhav Thackeray backstabbed, Maharashtra Politics

Amid the rebellion by Shiv Sena leader Eknath Shinde against Maharashtra Chief Minister Uddhav Thackeray and incidents being reported of offices of some rebel MLAs being attacked and damaged, Independent Lok Sabha MP from Amravati Navneet Rana on Saturday sough President's Rule in the state.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించనున్నారా.? నవనీత్ వ్యాఖ్యల వెనుక ఎవరు.?

Posted: 06/25/2022 03:49 PM IST
Impose president s rule in maharashtra says mp navneet rana cites thackeray s hooliganism

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ అటు శివసేన పార్టీ అనుకూల, ప్రతికూల వర్గాలతో పార్టీ నిట్టనీలువునా రెండుగా చీలిపోతోంది. ఇంతకాలం శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే అంటే మహారాష్ట్రవాసుల్లో ఉన్న భక్తి, అయన పార్టీ ఎమ్మెల్యేల్లో కనరావడం లేదు. దీంతో శివసేన పార్టీ ఇప్పుడు ఉద్దవ్ థాక్రే వర్సెస్ ఏక్‌నాథ్ షిండే శివసేన అన్నట్లుగా వ్యవహారం కొనసాగుతోంది. శివసేన తమ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలకు అల్టిమేటం ఇచ్చినా.. మా వేనుక ఓ సుప్రీం పవర్ ఉందంటూ ఏక్ నాథ్ షిండే అనుకూల వర్గం కూడా ధీటుగానే కౌంటర్ ఇస్తోంది. అంతా అనుకున్నట్లు మహారాష్ట్రలో ప్రభుత్వ మార్పు అనివార్యమా.? అంటే తాజాగా కొత్త వాదన తెరపైకి వచ్చింది.

అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్ రాణా మహారాష్ట్రలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో సంచలన డిమాండ్ చేయడం రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. రెబల్స్ శిబిరంలో చేరిన ఎమ్మెల్యేల ఆఫీసులపై శివసేన కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆమె చేసి కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రేను విడిచిపెట్టి బాలాసాహెబ్ సిద్ధాంతాలకు కట్టుబడి తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత కల్పించాలని నవనీత్ రాణా కోరారు. వారిపై తిరుగుబాటు చేసిన నేపథ్యంలో దాడులు జరిగే అవకాశం ఉందని ఈ విషయంలో అమిత్ షా జోక్యం చేసుకుని భద్రత కల్పించాలని కోరారు.

ఉద్ధవ్ ఠాక్రే గుండాయిజానికి స్వస్తి పలకాలన్న నవనీత్ రాణా.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అయితే నవనీత్ రాణా ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక కూడా అదే సుప్రీం పవర్ ఉందా.? అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అదే జరిగితే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమే అన్నట్లు రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. కేవలం రాష్ట్రపతి పాలనను పక్షం రోజుల నుంచి నెల రోజుల పాటు విధించి.. ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని తెరవెనుక చక్రం తిప్పుతున్న రాజకీయ ధురంధరులు భావిస్తున్నారా.? అన్న సందేహాలు కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే నవనీత్ రాణా రాష్ట్రపతి పాలనను డిమాండ్ చేస్తూ వ్యాఖ్యలు చేసే ముందు ఏక్ నాథ్ షిండే ఈఅంశంపై లేఖ రాయడం సంచలనం రేపుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాసిన షిండే.. తనకు మద్దుతు ప్రకటించిన 38 మంది ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించడంపై మండిపడ్డారు. తమ కుటుంబాలకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని భద్రత తొలగించడం అంటే భయపెట్టడమేనని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల తమ కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎంతో పాటు మహారాష్ట్ర హోం మంత్రి, డీజీపీలకు లేఖ రాశారు.

పొలిటికల్ క్రైసిస్ నేపథ్యంలో రెబర్స్‌ను ఉద్దేశించి శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించిన తీరు సంచలనం రేపుతోంది. ఇప్పటి వరకు శివసైనికులు ఓర్పుతో ఉన్నారని.. సమయం గడుస్తున్నా కొద్ది వారి సహనం నశిస్తోందని అన్నరు. ఒక వేళ వారు బయటకు వస్తే వీధుల్లో అగ్గి రాజుకుంటుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పుణెలోని రెబల్‌ ఎమ్మెల్యే తానాజీ సావంత్‌ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడి చేయడంతో ఒక్కాసారిగా మహారాష్ట్ర రాజకీయం టెన్షన్ టెన్షన్‌గా మారిపోయింది. దీంతో తమపై ఏరకంగా దాడి జరుగుతుందో అనే ఆందోళనలో రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారని షిండే లేఖ రాయడం సంచలనం రేపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles