మహారాష్ట్రలోని మహావికాస్ఆఘాడి ప్రభుత్వకూటమి కుప్పకూలడం ఖాయంగా మారింది. శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ప్రస్తుతం అధికారంలో ఉండగా, శివసేన పార్టీ నుంచి ఏకంగా 40 మంది వరకు ఎమ్మెల్యేలను ఆ పార్టీ నేత ఏక్ నాథ్ షిండే.. గుజరాత్ కు తరలించి.. అక్కడి నుంచి అసోంకు తరలించి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అంతేకాదు.. ఇకపై ఉద్దవ్ థాకరేకు సంబంధించి శివసేనకు ఎలాంటి సంబంధం లేదని, అసలైన శివసేన తమదేనని, తననే అత్యధిక మంది ఎమ్మెల్యేలు నాయకుడిగా ఎన్నుకున్నారని ఆయన ప్రకటించడం మహారాష్ట్ర సహా దేశరాజకీయాల్లో పెనుసంచలనంగా మారింది.
ఇక ఇదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే సాయంత్రం ఐదు గంటల వరకు ఎమ్మెల్యేలకు సమయం ఇస్తున్నానని, అప్పటిలోగా తిరిగి రావాలని. ఆ తరువాత వచ్చిన వారిని తాను తమ పార్టీ ఎమ్మెల్యేగా పరిగణించబోనని చెప్పడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో గంటగంటకు మారుతూవచ్చాయి. ‘మహా’ రాజకీయ సంక్షోభంపై ఉద్ధవ్ థాకరే ఇవాళ సాయంత్రం ఫేస్‌బుక్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలకవ్యాఖ్యలు చేశారు. తాను పదవి కోసం పోరాటం చేసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.
తానేమీ సీఎం కావాలని కోరుకోలేదని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అభీష్టం మేరకే తాను ఆ పదవిని స్వీకరించానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆ పదవిని కూడా తాను సమర్థంగానే నిర్వహించానని తెలిపారు. హిందూత్వ అనేది తమ పార్టీ సిద్ధాంతమన్న థాకరే... దానిని పార్టీ గానీ, తాము గానీ ఎప్పుడూ వదిలిపెట్టలేదని చెప్పారు.సీఎం పదవికి తాను సరిపోనని పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తే పదవి నుంచి దిగిపోయేందుకు తాను సిద్ధమేనని కూడా ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ఒక్క ఎమ్మెల్యే చెప్పినా... మరుక్షణమే తాను పదవికి రాజీనామా చేస్తానని థాకరే కీలక ప్రకటన చేశారు. సీఎం పదవికి రాజీనామా లేఖను తన వద్దే సిద్ధంగా ఉంచుకున్నానని కూడా ఆయన ప్రకటించారు.
శివసైనికుడు ఎవరైనా సీఎం కావచ్చనన్న ఆయన.. ఆ పదవి కోసం నమ్మక ద్రోహానికి పాల్పడటం క్షమార్హం కాదన్నారు. తాను నమ్మకద్రోహానికి గురయ్యానని చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనను వ్యతిరేకించడంతో షాక్ కు గురయ్యానని తెలిపారు. రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని గవర్నర్ కు తెలిపానని అన్నారు. చర్చలకు రావాలని ఏక్ నాథ్ షిండే, రెబెల్ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా లేనని తెలిపారు. శివసేన పార్టీని నడిపేందుకు తాను పనికిరానని చెపితే తాను తప్పుకుంటానని ఉద్ధవ్ అన్నారు. మహా ప్రజలపై మళ్లీ ఎన్నికల భారం మోపడం ఇష్టంలేకే తాము కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిశామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more