Anand Mahindra's 'Agnipath' Pitch, Some Questions Raised ఆనంద్ మహీంద్రాకు మాజీ సైనికోద్యోగుల ప్రశ్న.?

On industrialist anand mahindra s agnipath pitch some questions raised

Agnipath, Anand Mahindra, Anand Mahindra tweet, Agnipath scheme, Agnipath News, Agnipath protests, agnipath protests news, Agnipath Scheme, Agnipath protests, agnipath, Supreme Court, SC, plea, uttar pradesh, supreme court, plea, indian army, caveat, agnipath scheme, agnipath, Indian army, army recruitment, National, Politics

Following industrialist Anand Mahindra's pitch for 'Agnipath' and offer to hire 'Agniveers', several social media users, some of them military veterans, asked if the Mahindra Group has hired former top officers earlier in key positions. Amid nationwide protests against 'Agnipath', Mr Mahindra on Monday had said that the Mahindra Group would welcome the opportunity to recruit people trained under the scheme.

‘మీరు ఎంతమందికి ఉద్యోగం కల్పించారు.?’ ఆనంద్ మహీంద్రాకు మాజీల ప్రశ్న

Posted: 06/22/2022 08:43 PM IST
On industrialist anand mahindra s agnipath pitch some questions raised

అగ్నివీరులుగా బయటకు వచ్చిన తరువాత వారికి మంచి అవకాశాలు ఉంటాయని ఇటీవల అగ్నపాత్ పథకాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసిన నలుగురు పారిశ్రామిక వేత్తలకు విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక అగ్నివీరులకు తాను ఉద్యోగాలిస్తానంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల చేసిన ట్వీట్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఓ వైపు ఆశావహులు, మరోవైపు యువత, నెటిజనులు, సోషల్ మీడియా నుంచి తీవ్ర విమర్శలను చవిచూశారు.

ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని స్వాగతించిన పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు తమ సంస్థలో ఉద్యోగాలిస్తామని చేసిన ట్వీట్ పై కూడా మండిపడుతున్నారు. ఇక తాజాగా పలువురు మాజీ సైనికాధికారులు కూడా ఆనంద్ మహీంద్రా ట్వీట్ పై తీవ్రంగా స్పందించారు. వీరిలో భారత నావికాదళం మాజీ చీఫ్, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ మాజీ చైర్మన్ అరుణ్ ప్రకాష్ వంటి వారు కూడా ఉన్నారు. సర్వీసు పూర్తిచేసుకున్న అగ్నివీరులకు ఉద్యోగాలు ఇస్తారు సరే.. ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఎంతమంది సైనికాధికారులకు మీ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

కొత్త పథకం కోసం వేచి చూడడం ఎందుకని, ఇప్పటికే నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన వేలాదిమంది మాజీ సైనికులు, సైనికాధికారులు ఉన్నారని, ప్రతి సంవత్సరం వేలాదిమంది సైన్యం నుంచి బయటకు వచ్చి తమ రెండవ కెరియర్‌ను ప్రారంభించేందుకు వేచి చూస్తున్నారని ఆనంద్ మహీంద్రాకు అరుణ్ ప్రకాశ్ గుర్తు చేశారు. అలాంటి వారిలో ఇప్పటి వరకు మీరు ఎంతమందికి ఉద్యోగావకాశాలు కల్పించారో వెల్లడిస్తే బాగుంటుందని ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు. తాను 40 ఏళ్లుగా వాయుసేనలో సేవలు అందించానని, ఏళ్ల తరబడి ఇలాంటి హామీలను వింటున్నానని వాయుసేన మాజీ ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్ అన్నారు.

ఇది అగ్నిపాత్ పథకంపై దేశవ్యాప్తంగా ఎంతటి నిరసన ఉందో తెలియజేస్తోందని అన్నారు. ఆర్మీ ఉద్యోగాల కోసం ఎందరో యువత కొన్నేళ్లుగా కఠోర శ్రమకు ఓర్చి శ్రమిస్తుండగా, వారి ఆశలను అడియాశలు చేస్తూ కేంద్రం ప్రకటనలు చేయడం ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే దీనిని అప్పటికప్పుడు ప్రకటించినట్టుగా ఉందని మాజీ సైనిక ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అగ్నిపాథ్ పై రోజుకో ప్రకటన చేస్తుండడం.. ఆర్మీలో చేరే యువతకు తప్పుడు సంకేతాలను అందిస్తోందని విమర్శించారు. 25 శాతం మందిని ఆర్మీలోకి తీసుకుంటామని తొలుత ప్రకటించిన కేంద్రం.. అప్పుడే మళ్లీ శిక్షణ ఉంటుందని ఎందుకు ప్రకటించలేదని.. ఈ పథకం నోట్ల రద్దు ఘటనను తలపిస్తుందని వారు విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles