Police herding Shivsena MLAs like sheep: Prashant Bhushan పోలీసులతో ఎమ్మెల్యేలను అపహరించారు.. ఏక్ నాథ్ పై అరోపణలు..

Gujarat police herding shivsena mlas like sheep at surat airport prashant bhushan

Maharashtra Political Crisis, Maharashtra Government Formation, Maharashtra Government News, Maharashtra Assembly, Maharashtra Election, Maharashtra Government Party Alliance, Maharashtra MLA, Maharashtra MLC Election 2022, Maharashtra Vidhan Parishad, MLC Election, Sanjay Raut, Sharad Pawar, Shiv Sena, Uddhav Thackeray,Vidhan Parishad, Vidhan Parishad Election, Vidhan Parishad Election Maharashtra, Vidhan Parishad Election Maharashtra 2022, Ajit Pawar, BJP, Eknath Shinde, Maharashtra Politics

Senior most Supreme court Lawyer and activist Prashant Bhushan had tweeted today, saying that Gujarat Police herding the Maharashtra Shivsena MLAs like sheep at Surat airport!, and also demanded, If the Shiv Sena defectors bring down the Maharashtra govt, they must be disqualified & the assembly must be dissolved. Fresh elections must be held to enable the people of Maharashtra to decide if they want these Aya Rams & Gaya Rams as their MLAs

ITEMVIDEOS: అసోంకు మారిన ఏక్ నాథ్ క్యాంపు.. ఎమ్మెల్యేలను అపహరించారన్న అరోపణలు..

Posted: 06/22/2022 06:21 PM IST
Gujarat police herding shivsena mlas like sheep at surat airport prashant bhushan

మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారును కూలదోయడానికి ప్రయత్నిస్తున్న శివసేన పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్‌నాథ్‌ షిండేను ఇవాళ్టి మధ్యాహ్నం వరకు పోగిడిన రాజకీయ విశ్లేషకులు.. ఆ తరువాత ఆయన ఏం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇక స్వయంగా ఏక్‌నాథ్‌ షిండే మీడియా కంటపడ్డటంతో ఆయన అక్కడ వ్యవహరించిన తీరు.. తనను నమ్మివచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి.. వారికి అష్టదిక్కులా పోలీసుల వలయం ఏర్పడటం అంతా నిశితంగా గమనించారు. పోలీసులతో ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించారా? లేక పోలిసుల సహకారంతో ఎమ్మెల్యేలను అపహరించారా.? అన్న ఆరోపణలు గుప్పుమన్నాయి.

గుజరాత్‌లోని సూరత్‌ విమానాశ్రయంలో ఏక్‌నాథ్‌ షిండే మీడియాకు చిక్కారు. తమ మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి అసోంలోని గువాహటికి వెళుతుండగా వారిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. గుజరాత్‌ పోలీసులు, కేంద్రబలగాలు ఎమ్మెల్యేలకు రక్షణగా నిలిచాయి. వారిలో ఏఒక్కరూ మీడియాతో నోరు తెరువలేదు. నో కామెంట్స్ అంటూ వెళ్లారు. ఏక్‌నాథ్‌ షిండేతో సహా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు మీడియా విఫలయత్నం చేసింది. దీంతో తప్పించుకునేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు పరుగందుకున్నారు. అయితే తమకు మెజారిటీ ఉందని ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం.

గుజరాత్ లోని సూరత్ విమానాశ్రయంలో మహారాష్ట్రకు చెందిన శివసేన ఎమ్మెల్యేలను సూరత్ నుంచి గౌహతికి తరలిస్తున్న విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేలను తమ గూటికి వచ్చేందుకు వారికి ఆశ పెట్టే పద్దతులు పోయి.. అపహరించే పధ్దతులు వచ్చాయంటూ రాజకీయ విశ్వేషకులు విమర్శలు సంధించారు. శివసేన ఎమ్మెల్యేలను గొర్రెల మందను తరలించినట్టుగా సూరత్‌ విమానాశ్రయం నుంచి గుజరాత్‌ పోలీసులు తరలించారని ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీ ట్వీట్‌ చేసిన వీడియోను షేర్‌ చేస్తూ ఈ కామెంట్‌ చేశారు.

ఇక శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఒకరు మనసు మార్చుకుని సూరత్ హోటల్ నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడని సీనియర్‌ జర్నలిస్ట్‌ స్వాతి చతుర్వేది ట్వీట్‌ చేశారు. అతడిని దాడి చేయాలని ఇతర ఎమ్మెల్యేలను ఏక్‌నాథ్‌ షిండే ఉసిగొల్పారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన గుజరాత్ పోలీసుల రక్షణలో ఆసుపత్రిలో ఉన్నారని పేర్కొన్నారు. స్వాతి చతుర్వేది ట్వీట్‌పై ప్రశాంత్‌ భూషణ్‌ స్పందిస్తూ.. మహారాష్ట్ర ఎమ్మెల్యేలను సూరత్ హోటల్‌లో బంధించడం కిడ్నాప్‌ కంటే తక్కువేమీ కాదని వ్యాఖ్యానించారు. అధికార క్రీడలో ఎమ్మెల్యేలు అమ్ముడుపోడమే కాదు.. అపహరణకూ గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles