Daggubati Venkateswara Rao faces heart attack దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు.. అపోలో అసుపత్రిలో చికిత్స.!

Daggubati venkateswara rao faces heart attack treated in apollo hospital

Daggubati venkateswara rao angiogram, Daggubati venkateswara rao angioplasty, Daggubati venkateswara rao stunts, Daggubati venkateswara rao mild heart attack, Daggubati venkateswara rao, Purandeshwari, heart attack, Apollo hospital, Chandrababu Naidu, ICU, Jubilee Hills, Hyderabad, Telangana, Crime

Daggubati Venkateswara Rao, the son-in-law of the late Chief Minister NT Rama Rao, faced a mild heart attack this morning (Tuesday). He was rushed to Apollo Hospital by family members who responded quickly. An angiography was conducted, and a stent was put in his heart. According to the most recent news, the brother-in-law of Balakrishna, is now healing.

దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు.. అపోలో అసుపత్రిలో చికిత్స.!

Posted: 06/22/2022 11:31 AM IST
Daggubati venkateswara rao faces heart attack treated in apollo hospital

సీనియర్‌ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. తన గుండెల్లో నోప్పిగా ఉందని చెప్పడంతో ఆయన కుటుంబసభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయనను హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రతీ రోజు మాదిరిగానే ఉదయం వాకింగ్ చేసిన తరువాత ఆయన కొద్దిసేపు షటిల్ ఆట ఆడారు. ఈ క్రమంలోనే ఆయనకు గుండెల్లో నోప్పి వచ్చింది. దీంతో గుండెపోటు అని భావించిన ఆయన కుటుంబసభ్యులు వెంటనే అపోలో అసుపత్రికి తరలించి ఎమర్జెన్సీలో చేర్పించారు.

దగ్గుబాటి పరిస్థితిని అంచనా వేసిన వైద్యులు ఆయనకు తొలుత యాంజియోగ్రామ్ నిర్వహించి.. గుండెలో ఎక్కడైనా బ్లాకులు వున్నాయా.? అని పరిశీలించారు. దీంతో రెండు చోట్ల బ్లాకులు ఉన్నాయని తెలుసుకున్న వైద్యులు.. యాంజియోస్లాస్టీ ద్వారా ఆయనకు రెండు స్టెంట్లు అమర్చారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, ఎలాంటి ప్రమాదం లేదని అపోలో వైద్యులు తెలిపారు. కాగా, దగ్గుబాటికి స్టెంట్లు వేశారన్న వార్త తెలియడంతో వెంటనే అపోలో అసుపత్రికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. చికిత్స పొందుతున్న దగ్గుబాటిని పరామర్శించారు. ఆయన అరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దగ్గుబాటి త్వరగా కోలుకుంటారని చంద్రబాబు ఆకాంక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles