రాష్ట్రపతి ఎన్నిక తేదీ సమీపిస్తోన్న వేళ విపక్షాలు ఇప్పటికే తమ అభ్యర్థిని ఖరారు చేసిన నేపథ్యంలో కేంద్రంలోని అధికార ఎన్డీయే పక్షం కూడా తమ రాష్ట్రపతి అభ్యర్థిని ఎట్టకేలకు ప్రకటించింది. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో రసవత్తరంగా మారనున్న రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపి ఆచితూచి అడుగులు వేస్తూ.. తమ అభ్యర్థిగా ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము బరిలోకి దింపనుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీజేపీ అగ్రనేతలు ముర్ము అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా మంగళవారం రాత్రి ముర్ము అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఝార్ఖండ్ గవర్నర్ గా పనిచేసిన ముర్ము సుదీర్ఘ కాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెను ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఇక ద్రౌపది ముర్ము వ్యక్తిగత వివరాల్లోకి వస్తే... ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైదపోసి గ్రామంలో 1958 జూన్ 20న సంతాల్ అనే ఆదివాసీ తెగ కుటుంబంలో ముర్ము జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించిన ముర్ము...శ్యామ్ చరణ్ ముర్మును వివాహమాడారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉండగా... చాలా కాలం క్రితమే భర్తతో పాటు ఇద్దరు కుమారులు చనిపోయారు. ముర్ము రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే... అమె తన రాజకీయ ప్రస్తానాన్ని బీజేపి పార్టీ నుంచే ప్రారంభించింది.
ఒడిశాలో 2000 మార్చిలో కొలువుదీరిన బీజేపీ, బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ముర్ము.. మంత్రిగా సత్తా చాటారు. ఆ తర్వాత 2015లో ఝార్ఖండ్ గవర్నర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన ముర్ము... ఆ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఐదేళ్ల పాటు గవర్నర్గా కొనసాగిన తొలి గవర్నర్గా చరిత్ర సృష్టించారు. తాజాగా ఆమె ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికయ్యారు. అయితే ప్రధానమంత్రి అభ్యర్థిగా తన శక్తిసామర్థ్యాలున్న వెంకయ్యనాయుడును కావాలని పక్కకు తప్పించిన బీజేపి.. ఆయనను ఉపరాష్ట్రపతిగా చేసింది. ఈ సారి ఆయనకు రాష్ట్రపతి రేసులో నిలచే అవకాశం కూడా కల్పించనుందన్న తరుణంలో ఆయనకు రిక్తహస్తాలను చూపింది.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more