Nalgonda Youth found shot dead in his SUV in US తెలుగు విద్యార్థిని బలితీసుకున్న అగ్రరాజ్య కాల్పులు..

Telangana software engineer shot dead in us maryland

Indian killed in US, Telangana man killed in US, Nalgonda man killed in US, Indian killed, University of Maryland, Telangana Software Engineer Shot Dead in US, Indian Software Engineer Shot Dead in US, Nakka Sai Charan crashed near Catonsville, Telangana man, Nalgonda Youth, Nakka Sai Charan, Gun Shot, SUV, Catonsville, Baltimore City, Maryland, US, Crime

A 25-year-old man hailing from Nalgonda district was shot dead by unidentified gun wielding persons in Baltimore City of Maryland in the US in the morning hours of Sunday. Nakka Sai Charan’s SUV, according to family members in Nalgonda, was found crashed near Catonsville. He, at the wheel, was found with a gunshot wound on the head. He was declared dead at the University of Maryland R. Adams Cowley Shock Trauma Center a little later.

తెలుగు యువకుడిని బలి తీసుకున్న అగ్రరాజ్య కాల్పులు.. మేరిల్యాండ్ లో ఘటన

Posted: 06/22/2022 12:50 PM IST
Telangana software engineer shot dead in us maryland

అగ్రరాజ్యంలో నానాటికీ పెరుగుతున్న తుపాకీ సంస్కృతి స్వదేశీయులతో పాటు మన దేశీయులను కూడా బలి తీసుకుంటున్నాయి. అగ్రరాజ్యంలోని తుపాకీ సంస్కృతిపై అక్కడి పాలకులు విచారం వ్యక్తం చేయడం మినహా.. ప్రజలు ప్రాణాలు పోతున్నాయని భావించి చట్టాల్లో సంస్కరణలను తీసుకురావడం మాత్రం చేయడం లేదు. ఫలితంగా అగ్రరాజ్య అభివృద్ది కోసం అహర్నిషలు కష్టపడి పనిచేస్తున్న అక్కడి ప్రవాస భారతీయులు కూడా వీటికి బలవుతున్నారు. ఇక మేరీల్యాండ్ లో పక్షం రోజలు క్రితం స్మిత్స్ బర్గ్ లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించిన విషాధాన్ని ఆ ప్రాంతవాసులు మార్చిపోకముందే మరోమారు కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

తాజాగా జరిగిన కాల్పుల్లో నల్గొండకు చెందిన యువ పర్యావరణ ఇంజనీరు మృతి చెందాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నక్కా సాయిచరణ్‌ (26) దుండగుడి కాల్పుల్లో మృతి చెందాడు. గత రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన ఆయన.. అక్కడి సిన్సినాటి యూనివర్శిటీ లో ఎంఎస్ పూర్తి చేసి.. అరు నెలల క్రితమే సాయిచరణ్‌ అక్కడి ఓ కంపెనీలో ఇంజనీరుగా ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు విమానాశ్రయం వద్ద దింపి.. తిరిగి ఇంటికి చేరుకుంటున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ఇది వరుసగా జరుగుతున్న కాల్పుల్లో భాగమా.? లేక విద్వేష నేరమా.? అన్నది ఇంకా తెలియరాలేదు.

సాయిచరణ్ పై కాల్పులకు పాల్పడింది ఓ నల్లజాతీయుడిగా తేలింది. విమానాశ్రయం నుంచి తిరిగివస్తున్న ఆయనపై సాయంత్రం సమయంలో కాల్పులకు తెగబడ్డాడని సమాచారం. ఆదివారం సాయంత్రం కాల్పుల ఘటన చోటుచేసుకోగా.. అతని స్నేహితులు సాయిచరణ్ తల్లిదండ్రులకు సోమవారం సమాచారం అందించారు. ఎన్నో ఆశలతో అగ్రరాజ్యానికి వెళ్లిన తమ బిడ్డ.. అనుకోని ఘటనలో ప్రాణాలు కోల్పోయాడని తెలియడంతో సాయిచరణ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో నల్గోండలోనూ స్థానికంగా విషాదం అలుముకుంది.

ఈ క్రమంలో శోకాతప్తుడైన సాయి చరణ్ తండ్రి నర్సింహా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సాయిచరణ్ ఉదయం జరిగిన కాల్పుల్లో మృతి చెందగా..  రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది.  సాయిచరణ్‌ ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. సిన్సినాటి యూనివర్శిటీ లో ఎంఎస్ పూర్తి చేశాడు.  ఆరు నెలలుగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే కారు కొనుగోలు చేశాడు‌. నవంబర్లో స్వదేశానికి వస్తానని‌ అన్నాడు. చివరిసారిగా శుక్రవారం మాతో మాట్లాడాడు. బ్యాంకు అకౌంట్ డిటైల్స్ అడిగితే పంపించాం’’ అని తెలిపారు. సాయి చరణ్‌ మృతదేహం త్వరగా వచ్చేలా చూడాలని ఆయన విదేశాంగ శాఖామంత్రిని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian killed  Telangana man  Nalgonda Youth  Nakka Sai Charan  Gun Shot  SUV  Catonsville  Baltimore City  Maryland  US  Crime  

Other Articles