మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వ కూటమిలో కలవరం ప్రారంభమైంది. తమ ప్రభుత్వానికి చెందిన కీలక నేతతో పాటు 12 మంది ఎమ్మెల్యేలు గుజరాత్ లోని బీజేపి కీలక నేతతో టచ్ లో ఉంటూ అక్కడికే మకాం మార్చారని వార్త అటు ప్రభుత్వంతో పాటు ఇటు రాజకీయపక్షాల్లోనూ అగ్గిరాజేస్తోంది. అంతేకాదు ఈ వార్త మహారాష్ట్రతో పాటు యావత్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న తరువాత మధ్యప్రదేశ్ పగ్గాలు కూడా చేపట్టిన బీజేపి.. ఆ పిమ్మట మహారాష్ట్రను టార్గెట్ చేసిందన్న వార్తలు వినిపించాయి. అనుకున్నట్లుగానే పావులను కదుపుతూ బీజేపి మహారాష్ట్ర సర్కారుపై గురిపెట్టింది.
రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండే, తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. వీరంతా ప్రస్తుతం గుజరాత్‌లో ఉండటంతో పాటు అక్కడే బీజేపికి చెందిన ఓ కీలక నేతతో టచ్ లో ఉన్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. షిండే వర్గం బీజేపిలో చేరుతుందా.? లేక కొత్త పార్టీని తెరపైకి తీసుకోస్తుందా.? అయితే కొత్త పార్టీ బీజేపితో మైత్రి కొనసాగించనుందా.? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతుంది. వీటిలో ఏ ఒక్కటి చేసినా ఆ చర్యలు మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్దవ్ ఠాక్రే సర్కారుకు ప్రమాదఘంటికలను మోగించేదిగానే ఉందని సంకేతాలు వెలువడుతున్నాయి.
ఏక్ నాథ్ షిండే శివసేనను వీడి పోనని ప్రకటిస్తే తప్ప.. మహారాష్ట్ర సర్కారు ఊపిరి పోసుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ఆయన తన మద్దతుదారు ఎమ్మెల్యేలతో కలసి బీజేపిలో చేరినా.. లేక పార్టీకి రాజీనామా చేసినా.. ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిందే. దీంతో బలం తగ్గి మెజార్టీ కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో అధికారినికి కూడా దూరం కావాల్సివస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం స్థానాలు 288 కాగా, ప్రస్తుతం ప్రధాన పార్టీ బలాబలాలు ఇలా ఉన్నాయి. ఇందులో ఒక శివసేన ఎమ్మెల్యే ఇటీవల మరణించారు. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 287గా ఉంది. అసెంబ్లీలో మెజార్టీకీ 144 మంది సభ్యుల మద్దతు కావాల్సిఉంది.
ప్రస్తుతం మహావికాస్ అఘాడీ బలం 152గా ఉంది. ఇందులో శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఏక్ నాథ్ షిండేకు మద్దతు పలుకుతూ ఏకంగా 22 మంది ఎమ్మెల్యేలు గుజరాత్ లో ఉన్నారు. ఏక్‌నాథ్ షిండే సహా వీరంతా రాజీనామా చేస్తే శివసేన సంఖ్యా బలం 33కు తగ్గుతుంది. అప్పుడు సంకీర్ణ ప్రభుత్వ బలం కూడా 130కి పడిపోతుంది. అలాకాకుండా ఏక్ నాథ్ తన 22 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తే.. అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 265కు తగ్గుతుంది. దీంతో ప్రభుత్వానికి కావాల్సిన సంఖ్యా బలం 133గా ఉంటుంది. ఇక ఇప్పుడు బీజేపి బలం 106గా ఉండగా, చిన్నపార్టీలు, స్వతంత్రుల మద్దతుతో తమకు 135 మంది సభ్యుల బలముందని బీజేపి చెబుతోంది. అంటే మెజార్టీ మార్క్ కంటే ఇద్దరు ఎక్కువగానే ఉన్నారు.
మహారాష్ట్రలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయ పరిస్థితులపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. విపక్షాల తరఫున ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన ఆయన.. అక్కడే మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరగడం ఇది మూడోసారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కొత్త విషయం ఏమీ కాదన్న ఆయన.. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి తాము పరిష్కారం కనుక్కొంటామని చెప్పారు. ఏక్‌నాథ్ షిండే సీఎం కావాలనుకుంటున్న విషయాన్ని ఎప్పుడూ బహిర్గతం చేయలేదని.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సీఎం ఉద్ధవ్ ఠాక్రే చక్కదిద్దగలరన్న విశ్వాసం తమకు ఉందన్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more