Venkaiah Naidu As Next President? Sparks Buzz ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడేనా.?

Amit shah nadda meet venkaiah naidu ahead of bjp meeting on presidential candidate

President Election 2022, President Election 2022 schedule, President Election 2022 date, President Election 2022 India, Rajnath Singh, Amit Shah, Venkaiah Naidu, President Election 2022 BJP candidates, President Election 2022 result, Presidential Polls, NDA, BJP, Amit Shah, NDA Presidential Candidate, Rajnath Singh, M Venkaiah Naidu, National Politics

Union Ministers Amit Shah and Rajnath Singh, along with Bharatiya Janata Party (BJP) President JP Nadda, met Vice President M Venkaiah Naidu on Tuesday, sparking conversations about the latter being considered by the party for the post of president.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడేనా.? బీజేపి పెద్దల భేటీతో సంకేతాలు.?

Posted: 06/21/2022 03:34 PM IST
Amit shah nadda meet venkaiah naidu ahead of bjp meeting on presidential candidate

రాష్ట్రపతి ఎన్నిక తేదీ సమీపిస్తోన్న వేళ విపక్షాలు ఇప్పటికే చర్చలు నిర్వహిస్తూ.. తమ అభ్యర్థిపై స్పష్టతను తీసుకువచ్చేందుకు సహ్నాహాలు చేస్తున్నాయి. ఇక అధికార ఎన్డీఏ పక్షం మాత్రం ఇప్పటికీ ఇంకా అభ్యర్థిపై స్పష్టతనే ఇవ్వలేదు. ఈ పదవిలో రెండో పర్యాయం ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కూర్చోబెడతారా.? లేక ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును బరిలోకి దింపుతారా.? అన్న విషయమై క్లారిటీ కూడా లేదు. అది ఇవాళ్టి ఉదయం వరకు. కానీ ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే.. వెంకయ్యనాయుడినే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ ఎన్నికకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దించాలని బీజేపి అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అందుకు ఇవాళ జరిగిన పరిణామాలే సంకేతాలను ఇస్తున్నాయి. ఈ విషయమై బీజేపి పెద్దలు వెంకయ్య నాయుడితో సమావేశం కావడమే సంకేతాలను బలపరుస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వెంకయ్యనాయుడు నివాసానికి చేరుకున్న పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ లు వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో వారు వెంకయ్యనే తమ అభ్యర్థిగా ప్రతిపాదించారని సమాచారం.

అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజును పురస్కరించుకుని ఈ ఉదయం వెంకయ్య నాయుడు సికింద్రాబాద్‌లో నిర్వహించిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భీజేపీ నేతలతో భేటీ నిమిత్తం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించేందుకు బీజేపి పార్లమెంటరీ పార్టీ భేటీ కానున్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇవాళ సాయంత్రం బీజేపి ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై తుది నిర్ణయం తీసుకుని ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ఈ ఎన్నికల కోసం పలువురు కేంద్ర మంత్రులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు సహా 14 మంది నేతలతో బీజేపి ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో జేపీ నడ్డా భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పలువురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు కూడా ఉంది. ఇక మరోవైపు, రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ప్రతిపక్ష పార్టీలు కూడా సమావేశమై తమ అభ్యర్థిని ఖరారు చేయనున్నాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా, మహాత్మగాందీ మనవడు గోపాలకృష్ణ గాంధీ, ఫరూఖ్ అబ్దుల్లాలు వున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles