One dead, several injured in Washington, D.C., shooting అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తూటాలు.. వాషింగ్టన్ లో ఘటన

Gunshots panic on washington dc street people run for cover

washington shooting, 1 dead, 3 injured in DC shooting, shooting in us, juneteenth concert, US shooting, Washington Shooting, washington shootout, moechella shooting, washington shootout Sunday, washington D.C, United States, usa news,washington news,teenager killed in shooting,international news,dc shooting,shooting in dc

A shooting at crowded intersection of Washington, D. C., left one teenager dead and three others (including one police officer) injured, the Metropolitan Police Department of the U. S. capital has confirmed. Though details of the incident and the shooter have not yet been revealed, MPD chief Robert J. Contee told the media that a 15-year-old died in the firing at 14th and U street, NW, as crowds gathered in a concert area to celebrate Juneteenth.

అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తూటాలు.. వాషింగ్టన్ లో ఘటన

Posted: 06/20/2022 12:30 PM IST
Gunshots panic on washington dc street people run for cover

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. వాష్టింగన్‌ డీసీలోని 14వ, యూస్ట్రీట్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఓ పోలీస్‌ అధికారి సహా ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. వైట్‌ హౌస్‌కు రెండు మైళ్లదూరంలో యూ స్ట్రీట్‌ నార్త్‌వెస్ట్‌లో ఓ సంగీత కచేరి కార్యక్రమంలో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతం వైపుగా ఎవరూ వెళ్లొద్దని సూచించారు. అయితే, కాల్పులకు కారణాలు తెలియరాలేదు. ఇటీవల కాలంలో అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

మే 24న టెక్సాస్‌లోని రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో 2018లో మార్జోరీ స్టోన్‌మ్యాన్‌ డగ్లస్‌ హైస్కూల్‌ కాల్పుల తర్వాత అత్యంత విషాదకరమైన సంఘటన. అప్పటి దాడిలో 17 మంది మరణించారు. మే 31న న్యూ ఓర్లీన్స్‌లోని హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. ఈ నెల 1న ఓక్లహోమాలో ఆసుపత్రి క్యాంపస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యంలో వరుసగా జరుతున్న కాల్పుల ఘటనలతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles