జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ లో ఇవాళ ఉదయం జరిగిన ఎన్ కౌంటరల్లో నలుగురు పాక్ ప్రేరేమిత ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. దీంతో జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదలు ఏరివేతలో భారత భద్రతా బలగాలు విజయం సాధించాయి. కుప్వారాలో జరుగుతున్న ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదలు హతమయ్యారు.
కాగా, ఆదివారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల ఘటనలో మొత్తం నలుగురు ఉగ్రవాదులను భారత బద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ సందర్భంగా ఘటనాస్థలం నుంచి భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు. కుప్వారాలోని లోలాబ్ ప్రాంతంలో ఉగ్రవాది షౌకత్ అహ్మద్ షేక్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని నుంచి రాబట్టిన సమాచారంతో.. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు.
ఈ క్రమంలో బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరుపడంతో నలుగురు మృతి చెందారని సోమవారం పోలీసులు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల్లో పాక్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాది షౌకత్ అహ్మద్ షేక్ సైతం ఉన్నట్లు చెప్పారు. ఆదివారం కుల్గామ్ జిల్లా దమ్హాల్ హంజిపోరా ప్రాంతంలో గుజ్జర్‌పోరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకోగా.. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులను కుల్గామ్‌కు చెందిన జాకీర్ పదార్, శ్రీనగర్‌కు చెందిన షరీఫ్‌గా గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more