సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. అందులోకి వెళ్ళాలని ఎంతో మంది ఆశపడుతుంటారు. కానీ అందరికీ అవకాశాలు రావు. ఛాన్స్‌లు వచ్చినా కొందరు నిలదొక్కుకోలేరు. అయితే సినీరంగంలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా కలిసిరావాలని అంటుంటారు. ముఖ్యంగా నటీమణులు సినిమాల్లో నిలదొక్కుకోవాలంటే ఈ రెండింటింతో పాటుగా అందం కూడా ఉండాలి. అందుకే గ్లామర్‌గా కనిపించడానికి కొంతమంది సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది తారలు అందంగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకున్నారు.
అయితే సర్జరీలు కూడా కొన్ని సార్లు బెడిసి కొడుతుంటాయి. ఎంతలా ఉంటే ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. ప్రస్తుతం ఇలాంటి బాధనే అనుభవిస్తోంది నటి స్వాతి సతిష్. ‘ఎఫ్ఐఆర్’, ‘6 టూ 6’ వంటి తదితర చిత్రాలతో స్వాతి కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో స్వాతి కెనాల్ థెరపీ చేయించుకుంది. తీరా ఆ ఆపరేషన్ ఫెయిల్ అవడంతో ముఖం అంతా వాచిపోయింది. ఆ వాపు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పినా 3 వారాలకు కూడా తగ్గలేదు. అంతేకాకుండా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు స్వాతి చెప్పుకొచ్చింది.
ముఖం ఉబ్బడంతో ఎవరు గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని, ఇంటి నుంచి బయటకు కూడా వెళ్లడం కష్టంగా ఉందని తెలిపింది. ముఖంపై వాపు ఉండటంతో తనకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాగా ఆ హాస్పిటల్లో డెంటిస్ట్ తనకు తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాడని స్వాతి ఆరోపిస్తోంది. సర్జరీలో భాగంగా అనస్థీషియాకు బదులు సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చారని.. చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఈ విషయం తెలిసినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న స్వాతి కోలుకున్నాక సదరు ఆస్పత్రిపై, డాక్టర్‌పై కేసు వేయనున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more